కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో నూతన ఉత్సాహం నింపడానికి ఆయన కొన్ని కొన్ని చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ చర్యలు పెద్దగా ఫలించే అవకాశాలు కనపడటం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్న విషయం. కొద్దిరోజుల నుంచి ఆయన పార్టీ మీద ఎక్కువగా దృష్టి పెట్టడమే కాకుండా పార్టీ వ్యవహారాలను ముందుకు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు సహకరించకపోయినా సరే పాదయాత్ర చేయడం ద్వారా పార్టీని పూర్తిస్థాయిలో ముందుకు నడిపించే విధంగా కష్టపడుతున్నారని అంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డికి కొన్ని కొన్ని విషయాల్లో పార్టీ నాయకుల నుంచి సహకారం లేక పోవడమే కాకుండా మీడియా నుంచి కూడా సహకారం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు రేవంత్ రెడ్డికి సహకరించడం లేదని అధికార పార్టీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఎక్కువగా ఫోకస్ చేసే సాధన మీడియా సంస్థలో రేవంత్ రెడ్డి ప్రసంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో కూడా పెద్దగా కొన్ని వర్గాల మీడియా ప్రమోట్ చేయడం లేదని దానికి తోడు రేవంత్ రెడ్డికి అభిమానులు గా ఉన్నవాళ్లు మాత్రమే ఆయన ను ప్రమోట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు రేవంత్ రెడ్డి ప్రసంగాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని అంశాల్లో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నా సరే దాన్ని వాడుకొనే విషయంలో ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: