2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజలకు అనుకూలంగా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీలో అప్పుడున్న నాయకులు చాలా వరకు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి దానికి లభించే ఫలాలలో వివరించే విషయంలో వెనకడుగు వేసేవారు. రాజకీయంగా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి పార్టీ బలంగా ఉన్నా సరే కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో పార్టీ నేతల సహకారం అందేనా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్ళేది అనేది చాలా మంది కార్యకర్తలు 2019 ఎన్నికలకు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కానీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గాని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరించడం లేదని తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు కూడా ఈ విషయంలో వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు అధికార పార్టీ నాయకులు శాసనసభలో విమర్శించిన సమయంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవసరం ఉన్నా చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టే అవకాశం వచ్చినా సరే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుకోలేక పోయారు అనేది క్లియర్ గా అర్థమవుతున్న అంశం.

అదే విధంగా చంద్రబాబు నాయుడు కడప చిత్తూరు జిల్లాల్లో పర్యటన చేస్తున్న సరే దానికి సంబంధించి కనీసం సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్ చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉందని అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా కొంత మంది కార్యకర్తలు అనవసర విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని అంటున్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రధాన సమస్యగా మారింది అనేది చాలా మంది మాట్లాడే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: