రాజ‌కీయం ఎలా ఉన్నా మోడీదే పై చేయి కావాలి. తెలంగాణ‌లో అయినా, ఆంధ్రాలో అయినా కేసీఆర్ దే పెద్ద‌న్న పాత్ర కావాలి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఆ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మాట్లాడ‌క‌పోగా, త‌రుచూ వీరిద్ద‌రూ లోపాయికారి ఒప్పందాల్లో భాగంగా నే కేంద్రం ఏం చెబితే అది చేసుకుని పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కానీ వి ద్యుత్ చ‌ట్టాల‌పై కానీ కాస్తో కూస్తో వ్య‌తిరేక స్వ‌రం కూడా వినిపించ‌లేదు మొన్న‌టి దాకా! ఒక‌వేళ వినిపించినా అది కూడా కాసేపే! కానీ ధ‌ర్నా చౌక్ కేంద్రంగా చేసిన నిర‌స‌న‌ల్లో వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను నిర‌సించి, ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా రైతుల్లో త‌న బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకునేందుకు తెగ ప్ర‌య‌త్నించారు. ఇది కూడా కొద్దిరోజులే ఉంటుంది లేండి ఆ త‌రువాత కేంద్రంలో టీఆర్ఎస్ చేరిపోతే ఏ గొడ‌వా ఉండదు.


వాస్త‌వానికి మొద‌ట నుంచి ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లు ఉన్న కేసీఆర్ ఆ దిశ‌గా అడుగులు వేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. కొన్ని ఆర్థిక నేరాలు ఆయ‌న‌పై  ఉన్నాయ‌ని అందుకే వెనుక‌డుగు వేశారని కూడా కొంద‌రు అంటుంటారు. ఈ క్ర‌మంలో దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయిలో కేసీఆర్ ఇక‌పై రాణించ‌డం ఏమో కానీ కేంద్రంపై ఆయ‌న చేసే తిరుగుబాటు అన్న‌ది పూర్తి అబ‌ద్ధం అని మాత్రం చెప్ప‌వ‌చ్చు. అది కేవలం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోస‌మే త‌ప్ప ! ఆయ‌న ప్ర‌జా ప్ర‌యోజ‌నంకే కట్టుబ‌డుతూ చేసింది కాదు.



ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
ఎవ‌రు ఏం చెప్పినా వినొద్దు అని అంటారు కేసీఆర్. కానీ ఆయ‌న మాత్రం మోడీ చెప్పిన విధంగానే న‌డుచుకుంటూ ఉంటారు. కేంద్రం ఏం చెబితే అదే త‌న‌కు వేదం అని భావిస్తూ రాజ‌కీయం చేయ‌డంలోనే అంతా ఉంది. ఇది కేసీఆర్ కు మాత్ర‌మే తెలిసిన బ్ర‌హ్మ విద్య. అందుకే ఆయ‌న ఎక్కడున్నా ఎక్క‌డ లేక‌పోయినా కూడా మోడీ కి మాత్రం అనుగుణంగానే ఉంటారు. అంతేకాదు  త‌న‌దైన వ్య‌వ‌హార శైలి ఒక‌టి ఉంద‌ని నిరూపిస్తారు. ఇదే ఇప్పుడు ఆయ‌న విష‌య‌మై డైలమాకు తావిస్తోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజ‌నాల విష‌య‌మై త‌గువేసుకుని కావాల్సిన‌వి సాధించుకోవాలి కానీ ఎందుక‌ని ఆయ‌న మ‌రీ సాగిల‌ప‌డిపోతున్నారో త‌మ‌కు అర్థం  కావ‌డం లేద‌ని విప‌క్షం అంటోంది.



 వాస్త‌వానికి ఢిల్లీ పెద్ద‌ల‌కు కేసీఆర్ మ‌ధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయ‌ని, అందుకేనేమో ప్ర‌తిసారీ ఢిల్లీలో స‌న్మానాల పేరిట ఆయ‌న కాల‌క్షేపం చేస్తున్న‌ది అని కూడా అంటున్నారు కొంద‌రు. ఒకప్పుడు తాను అనుకున్న‌ది సాధించేదాకా ప‌ట్టు విడిచేది లేద‌ని చెప్పే కేసీఆర్, రాష్ట్ర సాధ‌న త‌రువాత వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు, అధికార కాంక్ష త‌ప్ప ఇంకేమీ ల‌క్ష్యంగా ఆయ‌నకు లేవ‌ని కూడా అంటున్నారు ఒక‌నాటి ఆయ‌న ఉద్య‌మ స‌హ‌చ‌రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: