గత కొన్ని రోజులుగా మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని శాసనసభలో చేస్తున్న వ్యాఖ్యల పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదేవిధంగా మీడియా సమావేశంలో అనవసరంగా కొడాలి నాని నోరు పారేసుకుంటున్నారు అని సమయం సందర్భం లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉద్దేశంలో ఆయన ఉన్నారని అంటున్నారు. రాజకీయంగా వైసిపి బలంగా ఉన్న సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యల విషయంలో వైసీపీ కార్యకర్తలలో కూడా వ్యతిరేకత రావచ్చు.

దానికి తోడు వల్లభనేని వంశీ కూడా ఈ మధ్య కాలంలో కాస్త నోరు పారేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీలో ప్రధాన ఆగ్రహానికి కారణమవుతోంది. ఇక కొడాలి నాని అంశానికి వస్తే ఆయన తాజాగా పరిటాల రవీంద్ర కు సంబంధించి చేసిన వ్యాఖ్యల పట్ల పరిటాల అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని టిడిపి నాయకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడమే గాని పరిటాల అభిమానులు మాత్రం ఎక్కడా కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి లేదు. సాధారణంగా అనంతపురం జిల్లాలో గాని కృష్ణా గుంటూరు జిల్లాల్లో గాని పరిటాల రవీంద్రకు భారీగా అభిమానులు ఉంటారు.

వీళ్లు ఎవరు కూడా పరిటాల రవీంద్ర కు మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొడాలి నాని ని ఉద్దేశించి విమర్శించారు చేసిన పరిస్థితి లేకపోవడంతో కాస్త వైసిపి నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. కొడాలి నాని చేసిన విమర్శల విషయంలో ఎక్కడో ఒకరిద్దరు పరిటాల అభిమానులు సోషల్ మీడియాలో స్పందించడమే కానీ పెద్దగా దీనికి సంబంధించి రియాక్షన్ లేదని అయితే కొడాలి నాని భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వెనుక పరిటాల అభిమానులు రియాక్ట్ కావొచ్చు అనే ఉద్దేశ్యమే ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: