తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేసిన అంశానికి సంబంధించి దూకుడుగా ముందుకు వెళ్ళడంతో మంత్రులు కూడా ఆయనకు సహకారము అందించాల్సిన అవసరం ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది మంత్రులు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ విషయంలో సైలెంట్ గా ఉండటం తల మీద కేసులు పెడతారు అని భయంతో చాలామంది మంత్రులు బయటకు రాకపోవడం పట్ల సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరిగింది.

రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని కొంతమంది నాయకుల విషయంలో ఆయన నిలబెట్టే అవకాశం ఉండవచ్చని ప్రధానంగా కొంత మంది భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా ఉండే నాయకుల మీద అలాగే మంత్రుల మీద సీఎం కేసీఆర్ నిఘా పెట్టారని అంటున్నారు.

హైదరాబాదులో ఉండకుండా ఎక్కువగా జిల్లాలో ఉండే మంత్రుల మీద సీఎం కేసీఆర్ నిగా పెట్టినట్టుగా కూడా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కొన్ని అస్త్రాలను ప్రయోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వాళ్లకు ఇచ్చే ఉద్దేశంలో  లేరని అంటున్నారు. ఇక మంత్రులు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడటం లేదు ఎవరు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు ఎవరు ఎంపీలతో సన్నిహితంగా ఉన్నారు ఎవరు ఉండటం లేదు అనే కీలక అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారని కొంతమందితో ఇప్పటికే ఆయన మాట్లాడారు అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr