అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు ఆర్తనాదాలతో బోరు మంటున్నారు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు  పెంచిన ధరల తో పోటీపడి మరి వ్యవసాయం చేయడం ఆ ప్రకృతికి  కూడా నచ్చదేమో. రాయలసీమలో అకాల వర్షాల ధాటికి రైతాంగం కూడా ఆందోళనలో పడింది. చేతికొచ్చిన పంట నీళ్ల పాలవడంతో అన్నదాత కన్నీళ్లు పెడుతున్నాడు. వందల ఎకరాల్లో వరి ధాన్యం, పండ్లతోటలు, కూరగాయల తోటలు వర్షాలతో ఎక్కడికి అక్కడ పాడైపోగా మరికొన్ని వరదల ధాటికి కొట్టుకుపోయాయి. మరోవైపు ఎలాగైనా పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అల్పపీడనం అంటూ వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. వరుస వర్షాలతో భారీగా నష్టపోతున్నారు

 అన్న దాతలు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అనావృష్టితో రైతన్నలు డీలా పడిపోయారు. ఈ వర్షాల వల్ల వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల ఇల్లు కూడా పోయి రోడ్డున పడ్డ రైతులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  ఓట్లేసి గెలిపించిన నాయకులు మొహం చాటేశారని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం కావడంతో ఆదుకునే దిక్కెవరంటూ అన్నదాతలు ఆవేదన పడుతున్నారు. కనీసం పంట నష్టం జరిగిన వారికి  ప్రభుత్వం సాయం కూడా అందించడం లేదని రైతులు కంట తడిపెడుతున్నారు. ఉన్న పంటను కూడా కొనుగోలు చేయడం లేదని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గత ఇరవై రోజుల పాటు అకాల వర్షాలు కురిసాయి. దీంతో నీటి ముంపుకు వేలాది ఎకరాల పంట గురైంది. వరి పొలాల నుంచి ఒక్క గింజ కూడా అన్నదాతల చేతికి  దక్కడం లేదు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో ప్రభుత్వం నుంచి వారికి ప్రత్యేక సాయం అందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గాలులకు పంట మొత్తం ఒరిగిపోయింది. తర్వాత నీటిలో చిక్కుకొని పూర్తిగా మునిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: