కరోనా.. ఇండియాలో దీని ప్రభావం ఇప్పుడు చాలా తక్కువ.. కరోనా ఇండియాలో చాలా బాగా కంట్రోల్ అయ్యింది. దాదాపు 550 రోజుల కనిష్ట స్థాయికి కరోనా కేసులు తగ్గిపోయాయి. దేశం మొత్తం మీద చూసినా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరలోపే ఉంది. దాదాపు 140 కోట్ల జనాభాలో ఈ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే.. మరి ఇండియా కరోనాను బాగానే అదుపు చేసినట్టేనా.. ఇంకా కరోనా మూడోవేవ్ అంటూ ఏమీ హడావిడి చేయదు కదా.. ఈ సందేహాలు ఇంకా చాలామందిలో ఉన్నాయి.


ఎందుకంటే.. ఇప్పుడు కరోనా అనేక యూరప్ దేశాల్లో మళ్లీ విజృంభిస్తోంది. అక్కడే అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉన్న ఆసుపత్రులు కూడా సరిపోని దుస్థితి యూరప్ దేశాల్లో కనిపిస్తోంది. మరి ఇండియా సంగతేంటి.. ప్రస్తుతానికి  దేశంలో కొవిడ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నా ఈ మార్పు ఇలాగే ఉంటుందా.. అంటే దాదాపు ఇంతే ఉంటుందని అంటున్నారు నిపుణులు.. ఇందుకు వారు చెబుతున్న లాజిక్ కూడా సమర్థంగానే కనిపిస్తోంది.


అదేంటంటే.. మార్చి- జులై మధ్య సెకండ్ వేవ్ సమయంలో అనేక మంది భారతీయులు వైరస్‌ బారినపడ్డారు. అలా వైరస్‌ బారిన పడిన వారికి యాంటీ బాడీస్ బాగా వృద్ధి చెందాయి. దీనికి తోడు  వ్యాక్సిన్‌ తోడైంది. అందుకే.. వైరస్‌తో పొరాడగలిగేలా రోగనిరోధక శక్తి మరింతగా అభివృద్ధి చెందిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో అనేక మంది ఇప్పటికే వైరస్‌ బారినపడడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడం కరోనా కేసుల తగ్గుదలకు కారణంగా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.


దేశంలో కొవిడ్‌ కేసుల తగ్గుదల శుభపరిణామమే. అయితే..ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్‌  కేసుల పెరుగుతున్నాయి. ఇది కొంతమేర ఆందోళన కలిగించే అంశమే. మిజోరం వంటి రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే.. ఈ ప్రాంతాల్లో కేసుల పెరుగుదల అంత భయపడే స్థాయిలో మాత్రం లేదు. అందుకే ఇండియా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశంలో మరోసారి వైరస్‌ విజృభించినా దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: