తెలంగాణలో రాజకీయం ఇప్పుడు వరి చుట్టూ తిరుగుతోంది. యాసంగిలో ధాన్యం కొనాలంటూ టీఆర్ఎస్ మంత్రులు దిల్లీలో కేంద్ర మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రేపు, ఎల్లుండి వరి దీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. కేసీఆర్ ఢిల్లీ టూర్, బీజేపీ నేతల ప్రకటనలు అన్నీ దొంగనాటకాలే అంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనకుండా టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడుతున్నారు. మోడీ, కేసీఆర్ లపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.. 27, 28 తేదీలలో ఇందిరా పార్కు వద్ద రెండు రోజులు వరి దీక్ష ఉంటుందని ప్రకటించారు.


ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే.. “ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గాంధీ భవన్ లో కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు, టిఆర్ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షులు అభిలాశ్ రావ్ తన వందలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. పాలమూర్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్ అన్నారు. కొల్లాపూర్ ప్రజలకు తాగడానికి నీళ్ల ఇవ్వరు ..రైతులకు సాగు నీళ్లు ఇవ్వరని..నిర్వాసితులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాను అని నమ్మించి మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.  ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది ..ఎవరు పాలన చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని,  పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా మోసం చేసిన ద్రోహి కెసిఆర్, పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఉందా కెసిఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


"వరి రైతులకి ఉరి అని కేసీఆర్ అంటున్నాడు. రైతులను చంపడానికే టిఆరెస్ , బీజేపీ కలసి పని చేస్తున్నాయి. కెసిఆర్ రెండోసారి సీఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు 67 వేల మంది రైతులు  చనిపోయారు.. ఇదా కేసీఆర్ తెలంగాణ రైతులకు చేస్తున్న సంక్షేమం అని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: