ఎన్టీఆర్ గురించి కొడాలి నాని అలా మాట్లాడతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ టైమ్ వచ్చింది కాబట్టి మంత్రి నాని కుండబద్దలు కొట్టారు. ఆయనకు, ఎన్టీఆర్ కి మధ్య రిలేషన్ అలానే ఉందని అనుకునేవారికి ఈ సమాధానం ఇచ్చారు. సహజంగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకి వస్తే మంత్రి సైలెంట్ గా ఉండేవారు, కానీ ఈసారి రియాక్ట్ అయ్యారు. ఇకపై అలాంటి ప్రశ్నలు టీడీపీనుంచి ఎదురు కాకుండా ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టారు.

ఎన్టీఆర్ తో తమకు సంభంధం లేదని, గతంలో కలిసున్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు మంత్రి నాని. అయితే ఇప్పుడు తమ బాస్ జగన్ మాత్రమేనని, ఆయన జోలికి వస్తే ఎవరినీ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ వివరణలోనూ చంద్రబాబును విమర్శించారే తప్ప, ఎన్టీఆర్ మాటలకు కౌంటర్ ఇవ్వలేదు. పక్క ప్రణాళిక ప్రకారమే నాని ఈ విధంగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఎన్టీఆర్ బాధపడకుండా, ఇటు సొంత పార్టీకి నష్టం కలగకుండా నాని పర్ఫెక్ట్ గా మానేజ్ చేశారని చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులోనూ టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా, ఎన్టీఆర్ పేరుతో తమని విమర్శించకుండా, తమ పేరుతో ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాలుగా కౌంటర్ ఇచ్చేశారు.

మొత్తమ్మీద ఎన్టీఆర్ పేరుతో టీడీపీ రాజకీయం చేయాలనుకున్నా.. దానిలో తాము పావులుగా మారకూడదనే ఉద్దేశంతోనే కొడాలి నాని, వల్లభనేని వంశీని పక్కనపెట్టుకుని మరీ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీలో కూడా తమని ఎవరూ ఎన్టీఆర్ సానుభూతి పరులుగా చూడకూడదనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ కి తమకి సంబంధం లేదని చెబుతూనే తమను ఎవరూ కంట్రోల్ చేయలేరని, జగన్ చెప్పినా, చెప్పకపోయినా.. ఆయన్ని విమర్శించేవారి నోరు మూయించడమే తమ పని అని అన్నారు నాని. చివరిగా ఎన్టీఆర్ కుటుంబంలో అందరూ చంద్రబాబు వలలో పడినా.. ఒక్కరు మాత్రం ఆయన మాటలకు పడిపోరని తేల్చి చెప్పారు. పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు మరోసారి మోసం చేయలేరని అన్నారు నాని. కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నుంచి రకరకాలుగా స్పందన వస్తోంది. అయితే ఎప్పటిలాగే దీనిపై ఎన్టీఆర్ స్పందించే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: