తెలంగాణ‌లో రాజ‌కీయా ప‌రిణామాల్లో శ‌ర‌వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి తామే స‌రైన ప్ర‌త్యామ్నాయం అని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు చెప్పుకుంటున్నాయి. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఫ‌లితాల‌తో కాషాయ పార్టీ ముందు వ‌రుస‌లోకి వ‌చ్చింది. ఆ త‌రువాత తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడు అయ్యాక పార్టీలో కొత్త ఊపు నిండింది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన క‌మ‌లం పార్టీ హ‌స్తం పార్టీకి వెనక్కు నెట్టింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా నాయ‌కులు అంతంతగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్తం అవుతున్నట్టు తెలుస్తోంది.


   అయితే, గులాబీ బాస్ సీఎం కేసీఆర్ చెప్పిన మాట‌లే చెప్పి ప్ర‌జ‌ల‌ను ప‌క్క దారి ప‌ట్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి  ప్ర‌తిప‌క్షాలు. హుజురాబాద్ లో ఎలాగైనా గెల‌వాల‌నుకుని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టిన  టీఆర్ఎస్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఈట‌ల విజ‌యం సాధించారు. ప్ర‌జా బ‌లం ముందు డ‌బ్బు బ‌లం ప‌ని చేయ‌ద‌ని ఈ ఎన్నిక ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇన్నాళ్లు ఉద్య‌మ పార్టీగా గుర్తించినా రెండు సార్లు అధికారం చెప‌ట్టిన తరువాత ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు మారుతాయి. ఇక గులాబీ పార్టీకి ప్ర‌త్యామ్నాయ పార్టీగా ఎదిగే క్ర‌మంలో వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది.

 
  ఈ క్రమంలో కాంగ్రెస్ ను వెన‌క్కునెట్టి ముందుకు దూసుకుపోతున్న బీజేపీ.. ప్ర‌జా క్షేత్రంలోనే తేల్చుకుందామ‌ని ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ పోటీ చేస్తోంది. మ‌రోప‌క్క కాషాయ పార్టీని తిట్టి పోస్తున్న టీఆర్ఎస్ ఆ పార్టీకి మేలు చేస్తుందనే చెప్పాలి. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీలు ఒక్క‌టే అని చెప్పే క్ర‌మంలో వెన‌క‌బ‌డిపోతున్నాడ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ వెనుక‌వ‌రుస‌లోనే ఉంద‌ని చెప్పాలి. అయితే, సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డితేనే బీజేపీ కాంగ్రెస్‌ను అధిగ‌మించ‌గ‌ల‌దు.  ఈ లోపు రేవంత్ రెడ్డి ఏం చేస్తారోన‌ని తెలంగాణ రాజ‌కీయ ప‌రిణామాలు నిర్ణ‌యించ‌నున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: