ఊహకందని రీతి లో భారీ రేంజ్ లో వరదలు రావడంతో ఇక దిక్కు తోచని స్థితిలో పడి పోయారు. అయితే భారీ వరదల ప్రభావానికి అటు ఏకంగా జనావాసాలు సైతం వరదల్లో కొట్టుకు పోయాయ్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా లోతట్టు ప్రాంతా లలో అయితే వరదల కారణం గా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక పోతే ఇక వరద ప్రభావిత ప్రాంతాల లో ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల పర్యటన చేస్తున్నారు. ఈ క్రమం లోనే బాధితులకు పరిహారం కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే వరదల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం తో అందరూ వణికి పోయారు. కానీ ఇక ఇప్పుడు పెద్ద ముప్పు తప్పినట్లే తెలుస్తోంది. బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు శ్రీలంక వైపుకు వెళ్తున్నట్లు ఇటీవల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు తప్పినట్లే అంటూ వాతావరణ శాఖ తెలిపింది.అయితే 28, 29 తేదీలలో గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయట.