ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మనుషుల ఆలోచనా తీరులో మార్పు వస్తుంది. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడపిల్లలపై వివక్ష చాలా తగ్గిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు ఆడపిల్లలు పుట్టడమే భారంగా భావించేవారు తల్లిదండ్రులు. ప్రతి కాన్పులో  కూడా కొడుకులు పుట్టాలి అని భావించేవారు. ఒకవేళ ఆడపిల్ల పుట్టింది అంటే చాలు ఏకంగా చెత్తకుప్పలో పడేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చి ఎంతో మంది మనసును కదిలించేవి. ఇలా పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయ్యే వరకు కూడా ఆడపిల్ల అడుగడుగునా వివక్ష ఎదుర్కొనేది. ఇలా ఆడపిల్ల పుట్టడం అంటే ఇష్టపడని నేపథ్యంలో ఇక దేశంలో ఆడపిల్లల కొరత తీవ్రంగా వేధించింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే వెయ్యి మంది పురుషులకు కేవలం 927 మంది మహిళలు మాత్రమే ఉన్నట్టు అప్పట్లో గణాంకాలు కూడా చెప్పాయ్. దీంతో ఇక దేశంలో ఆడపిల్లలను సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఆడపిల్లలపై వివక్ష కొనసాగిస్తున్న తల్లిదండ్రులలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ఇక ఇప్పుడు మనిషి ఆలోచన తీరు లో  ఎన్నో మార్పులు వచ్చాయి  ఇక ఇప్పుడు ఆడపిల్లలపై వివక్ష దాదాపుగా పూర్తిగా తొలగి పోయింది. ఇక ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు.


 మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ కూడా సంతోష పడే ఒక గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు ఒక వెయ్యి 20 మంది మహిళలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సెక్స్ రేషియో లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. 1995లో నిర్వహించిన సర్వేలో 1000 మంది పురుషులకు 927 మంది మహిళలు స్థాయి నుంచి ఇప్పుడు  పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్న స్థాయికి ఎదగడం అందరిని సంతోష పెడుతుంది. అయితే ఒక వైపు అమ్మాయిల సంఖ్య పెరిగినప్పటికీ చాలామంది అమ్మాయిలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అన్న విషయం మాత్రం సర్వేలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: