జ‌నం బాధ‌ల్లో ఉంటే చంద్ర‌బాబు నాయుడు వెళ్లి రాజ‌కీయం చేస్తున్నార‌ని ఏపీ మంత్రి పేర్ని నాని మిమ‌ర్శించారు. శుక్ర‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ ద‌గ్గ‌ర మాట్లాడారు. బట్టలు, బూట్లు ఇప్పకుండా పుష్కర స్నానం చెయ్యడం.. ప్రాణాలు పోవడానికి కారణం అవ్వడం మానవ తప్పిదం అని ఆరోపించారు. వరద బాధితుల వద్దకు వెళ్లి నా భార్యను అన్నారు అని చంద్రబాబు గోల చేస్తున్నారు అని మండిప‌డ్డారు. కడుపు మంట తో చంద్రబాబు పోయేలా ఉన్నారు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక సీఎం ను...మాజీ సీఎం గా ఉన్న వ్యక్తి గాల్లో కలిసి పోతావ్ అని ఎలా అంటారు అని ప్ర‌శ్నించారు.


  అసెంబ్లీ ఘటన ను మరుగున పడేయ్యాడానికి.. అన్నమయ్య ప్రాజెక్ట్ కు ప్రభుత్వమే బాంబులు పెట్టింది అనలేదు.. సంతోషం అని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్ల పై చిరంజీవి అభిప్రాయాన్ని చర్చిస్తాం అని తెలిపారు. సీఎం తో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం అని హామినిచ్చారు. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది అని, వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.. మా ఆవిడను తిట్టారని బాధితుల దగ్గర ఏడుపు ఎందుకు..? అని ప్ర‌శ్నించారు.


చంద్ర‌బాబు శ్రీమతిని  మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నాం అని నిన్ను తిడతాం గానీ...మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం? అని టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ను చీదరించుకుంటున్నారు అని పేర్కొన్నారు. మాకూ కుటుంబ సభ్యులున్నారు..మా ఇంట్లో ఆడవారు ఉన్నారని మాకు సంస్కారం ఉంది అని చెప్పారు. చంద్ర‌బాబుకు ఎవరినైనా వాడుకుని వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య అంటూ విమ‌ర్శించారు. కొడుకు వయసున్న ముఖ్యమంత్రి పై ఎంత అసూయగా మాట్లాడుతున్నావు అంటూ చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. చంద్రబాబు ఈర్ష్య,అసూయ తో రగిలిపోతున్నారు.  సీఎంగా ఉన్నప్పుడు వరదల్లో ఈదుకుంటూ వెళ్ళారా...? అంటూ బాబును ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: