ఉభయగోదావరి జిల్లాలు అంటేనే తెలుగుదేశం పార్టీకి ఎంత ప‌ట్టు కొమ్మ‌లో ప్ర‌త్యేకంగా చెప్పనవసరం లేదు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రెండు జిల్లాలు ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనూ పశ్చిమగోదావరి అంటే తెలుగుదేశానికి తిరుగులేదు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ప్రత్యర్థి పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు. 1994 లో జిల్లాలో ప్రతిపక్షాలకు అసలు ఛాన్స్ లేకుండా చేసింది.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ జిల్లాలో ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా రాకుండా టిడిపి మొత్తం స్వీప్ చేసింది. అలాంటిది జిల్లాలో గత ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. కేవలం పాలకొల్లు, ఉండి సీట్ల‌తో మాత్రమే సరిపెట్టుకుంది. పాల‌కొల్లు నుంచి నిమ్మ‌ల రామానాయుడు వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఉండిలో కొత్త నేత క‌ల‌వుపూడి రాంబాబు గెలిచారు.

అయితే వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ రెండున్న‌ర సంవ‌త్సార‌ల్లో జిల్లాలో సమీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారుతోన్న ప‌రిస్థితి అయితే ఉంది. అధికార వైసీపీ పై జిల్లా ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌లు కూడా అడియాస‌లు అవుతున్నాయి. దీంతో ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంద‌నే చాలా మంది నోట వినిపిస్తోన్న మాట‌. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే జిల్లాలో ఏడెనిమిది సీట్ల‌లో వైసీపీ ఓడిపోతుంద‌నే అంటున్నారు.

కొవ్వూరు - నిడ‌ద‌వోలు - త‌ణుకు - పోల‌వ‌రం, చింత‌ల‌పూడి తో పాటు మ‌రి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కి ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంటున్నారు. ఇక జ‌న‌సేన , టీడీపీ మ‌ధ్య పొత్తు కుదిరితే అస‌లు వైసీపీ అడ్ర‌స్ ఉండ‌ద‌నే అంటున్నారు. ముఖ్యంగా డెల్టాలో కాపులు ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండు పార్టీల క‌ల‌యిక తో వైసీపీకి చుక్క‌లే క‌న‌ప‌డుతాయ‌ని అంటున్నారు. ఏదేమైనా మ‌రోసారి టీడీపీ త‌న కంచుకోట ను నిలుపుకు నే ప‌రిస్థితి అయితే ఉంద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: