కడప జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ మేటర్ బాగా చర్చకు వస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే 1999 నుంచి కడప జిల్లాలో టిడిపి క్రమంగా బలహీనపడుతోంది వచ్చింది. 2004 ఎన్నికల్లో కమలాపురం సీటు తో సరిపెట్టుకుంది. టిడిపి 2009లో ప్రొద్దుటూరు సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో వైసిపి ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాజంపేట సీటులో మాత్రమే టిడిపి విజయం సాధించింది. అంటే వరుసగా మూడు ఎన్నికల్లో టిడిపి కి జిల్లాలో కేవ‌లం ఒకే ఒక్క సీటు వచ్చింది.

అలాంటి టిడిపి గత ఎన్నికల్లో జిల్లాలో అసలు బోణీ యే కొట్టలేదు. జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్ల లోనూ  వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కడప జిల్లాలో అధికార వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని టిడిపి వాళ్ళు చెబుతున్నారు. దీనికి తోడు వైసిపి లో ఉన్న గ్రూపు రాజకీయాలు కూడా తమకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయని టి.డి.పి వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మైదుకూరు - కమలాపురం - ప్రొద్దుటూరు - రైల్వేకోడూరు - రాజంపేట నియోజకవర్గా ల‌లో గట్టిపోటీ ఇస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు.  తాము ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఐదు సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా జిల్లా టిడిపి నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులకు నీరు తీసుకురావడంతో పాటు జిల్లాలో జరిగిన అభివృద్ధి ఈ సారి తమకు ప్లస్ అవుతుందని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. జిల్లా లో ఒక్క జ‌డ్పీటీసీని కూడా గెల‌వ లేదు. ఇక ఎంపీ పీ స్థానాల్లోనూ అదే ప‌రిస్థితి ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌రీ ఘోరం. అయితే మరి టిడిపి నేతల ఈ ధీమాకు కారణమేమిటో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: