నింగిని తాకిన ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసే చ‌ర్య‌లు
కొన్న‌యినా పాల‌క ప‌క్షాలు చేప‌డితే
త‌ప్ప‌క ధ‌ర‌లు దిగివ‌స్తాయి
అందుకు తార్కాణ‌మే ఆంధ్రా, త‌మిళ‌నాట
నెల‌కొన్న ప‌రిణామాలు...


ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టిసారిస్తే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి అనేందుకు ఆ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తీసుకున్న నిర్ణ‌యాలే ఓ గొప్ప ఉదాహ‌ర‌ణ. ట‌మాట ధ‌ర ను నియంత్రించేందుకు ద‌క్షిణాదిన స్టాలిన్ ఓ అడుగు ముందుకు వేసి స‌హ‌కార శాఖ ప‌రిధిలోకి అమ్మ‌కాలు తీసుకువ‌చ్చి, ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న స్టోర్ల ద్వారానే అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సామాన్యుల‌కు ఊర‌ట ఇచ్చింది. వాస్త‌వానికి వ‌ర‌ద‌లతో అత‌లాకుత‌లం అయిపోతున్న చెన్న‌య్ వాసుల‌కు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న సానుకూల నిర్ణ‌యాలు అన్నీ ఆనందాల‌నే ఇస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో వ‌ర‌ద సాయం అందించ‌డంలోనూ బాధితుల‌ను ఆదుకోవ‌డంలోనూ స్టాలిన్ క‌న్నా జ‌గ‌న్ వెనుక‌బ‌డిపోయారు. కానీ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో స్టాలిన్ క‌న్నా జ‌గ‌న్ ముందున్నారు. అక్క‌డ 76 రూపాయ‌ల‌కు కేజీ ట‌మాట ల‌భ్యం అవుతుంటే ఇక్క‌డ 60 రూపాయ‌ల‌కే అందిస్తుండ‌డం ఓ విధంగా  జ‌గ‌న్ స‌క్సెస్ కు కార‌ణం కావొచ్చు. ఇదే స్ఫూర్తితో పొరుగు రాష్ట్రాల స్ఫూర్తితో జ‌గ‌న్ ప‌నిచేసి ధ‌ర‌ల‌ను నియంత్రించ‌గ‌లిగితే మంచి పేరు తెచ్చుకున్న‌వారే అవుతారు అన‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.

 
ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
వ‌రుస వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఈ సారి మాత్రం మంచి నిర్ణ‌య‌మే తీసుకుని కాస్త ప్ర‌జా మ‌న్న న‌కు ద‌గ్గ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుని ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ట‌మాట ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు చుక్క‌లు చూపిస్తుండ‌డంతో ఈ కార్తీకం వేళ సంబంధిత విష‌య‌మై ముఖ్యంగా ధ‌ర నియంత్ర‌ణ విష‌య‌మై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం స‌ర్వ‌త్రా ఆమోదానికి నోచుకుంది. అదేవిధంగా యువ ముఖ్య‌మంత్రి ముందు చూపుతో తీసుకున్న నిర్ణ‌యాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు కూడా! ముఖ్యంగా ట‌మాట దిగుమ‌తులు పెంచ‌డంతో పాటు కొనుగోలు ప్ర‌క్రియ‌ను మార్కెటింగ్ శాఖ ప‌రిధిలోకి తీసుకురావ‌డంతో ధ‌ర కాస్త దిగి వ‌చ్చేలా ఉంది. ఫ‌లితంగా అర‌వై రూపాయ‌ల‌కే కేజీ ట‌మాటాను నిన్న గుంటూరు, కృష్ణా మార్కెట్లలో దొరికేలా ఉంచారు.

దిగివ‌చ్చిన ధ‌ర‌లు
చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలోనూ ధ‌ర దిగివ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అదే జిల్లా ముల‌క‌ల చెరువు మార్కెట్ దగ్గ‌ర కూడా బాక్సు ట‌మాట ధ‌ర మూడు వేలు నుంచి ఎనిమిది వంద‌ల‌కు దిగి వ‌చ్చింద‌ని అదే మీడియా త‌న క‌థ‌నాల ద్వారా వివ‌రం అందించింది. ఒక‌వేళ ఇదే స్థాయిలో అన్ని జిల్లాల‌లోనూ ట‌మాట ధ‌ర‌లు నియంత్రించ‌గ‌లిగి తే సీఎం స‌క్సెస్ సాధించార‌నే చెప్పాలి. వాస్త‌వానికి పొరుగు సీఎం స్టాలిన్ అంద‌రి క‌న్నా ముందే ట‌మాట ధ‌ర‌ను నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. రాష్ట్ర స‌హ‌కార శాఖ ప‌రిధిలో అమ్మ‌కాలు చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవడంతో కేజీ ధ‌ర 76 రూపాయ‌లకు దిగి వ‌చ్చింది. ఓ విధంగా మిగ‌తా రాష్ట్ర ముఖ్య‌మంత్రులు కూడా ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై తీసుకుంటున్న చ‌ర్య‌లు సానుకూలంగా ఉండ‌డంతో జ‌గ‌న్ కూడా అదే బాట‌లో న‌డిచారు. ఆశించిన ఫ‌లితం అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp