ఏపీలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఆ పార్టీ పరువు కాపాడిన జిల్లాల్లో తూర్పుగోదావరి - విశాఖపట్నం - ప్రకాశం జిల్లాలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న కృష్ణా , గుంటూరు జిల్లాల ప్రజలు కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఆ రెండు జిల్లాల్లో టిడిపి కేవలం రెండేసి ఎమ్మెల్యే సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది.

తెలుగుదేశం విశాఖపట్నం జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు ... తూర్పుగోదావరి జిల్లాలో 4.. ప్రకాశం జిల్లాలో కూడా నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. వైసిపి బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు రావడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు - అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ - చీరాల నుంచి కరణం బలరాం - కొండ‌పి నుంచి స్వామి ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచి గెలిచారు.

అయితే వీరిలో కరణం బలరాం వైసిపి చెంత చేరిపోయారు. అయితే ఇప్పుడు జిల్లాలో టీడీపీ బలంగా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం స‌రిగా లేకపోవడం కారణమ‌ని జిల్లా పార్టీ శ్రేణులే చ‌ర్చించు కుంటున్నాయి.  జిల్లా పార్టీ నాయకత్వం పార్టీకి బలమైన నాయకత్వం లేని చోట దృష్టి పెట్టక పోవ‌డంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి జిల్లాలో ఆధిపత్యం చాటుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులు, కేడ‌ర్ ఉండి కూడా కేవ‌లం జిల్లా నాయ‌క‌త్వం లోపా ల తో పాటు స్థానికంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుల‌ను కూడా నిల‌బెట్ట లేక‌పోవ‌డం కూడా వైసీపీకి ఎదురు దెబ్బ కానుంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే జిల్లా లో అద్దంకి - పర్చూరు - కొండపి - సంతనూతలపాడు - ద‌ర్శి లో తాము తిరుగులేని విజ‌యాలు సాధిస్తామ‌ని టీడీపీ లో ధీమా క‌నిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: