ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో చంద్రబాబు బాధపడిన సందర్భాలు లేవు. చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తూ బోరున విలపించారు.ఈ క్రమంలోనే తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టినా నలుగురు నేతలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారిని రాజకీయంగా అణ‌గ దొక్కాల‌నే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు భావిస్తున్నారు.

ఈ లిస్టు లో కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని తో పాటు , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. వీరిద్దరి నియోజకవర్గాలపై టిడిపి ఇప్పటికే స్పెష‌ల్ ఆప‌రేష‌న్‌ స్టార్ట్ చేసింది. గుడివాడలో మంత్రి కొడాలి నాని పై కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ను పోటీ చేయించి నాని ని ఓడించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. వంగవీటి రాధా గుడివాడ లో పోటీ చేస్తే కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపులు కూడా ఓట్లేసి నానిని ఓడిస్తారంటూ టిడిపిలో కొందరు చంద్రబాబుకు సూచిస్తున్నారు.

అందుకే కొద్ది రోజులుగా గుడివాడ‌లో పోటీ విష‌యంలో రాధా పేరు వినిపిస్తోంది. అయితే గన్నవరం లో వంశీ పై ఎవరిని పోటీకి పెట్టాలన్న విషయంలో మాత్రం బాబుకు పెద్ద చిక్కే వచ్చిపడింది. వంశీ పార్టీకి దూరం అయ్యాక చంద్ర‌బాబు బంద‌రుకు చెందిన‌ మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు.

గన్నవరం లో ఆయనతో అక్కడ పార్టీ బ‌ల‌ప‌డే పరిస్థితి లేదు. వంశీ ని ఎలాగైనా ఓడించాలంటే కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన నేత నే అక్కడ రంగంలోకి దింపాల్సి ఉంటుందని రాజకీయ చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఇప్పుడు అక్కడ వంశీకి బలమైన ప్రత్యర్థి సెట్ చేయడమే పెద్ద సవాలుగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: