ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. తెరాసకు అన్నిచోట్ల బలం ఉన్న రెండు చోట్ల కాంగ్రెస్ మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. అయితే అంతకుముందు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ తెరాస కొంత ట్విస్ట్ ఇచ్చింది. రాజ్యసభకు వెళ్తాననుకున్న కవిత అనూహ్యంగా ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. ఎమ్మెల్యే కోటా కింద ఆరు స్థానాలకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజ్యసభ నుంచి బండ ప్రకాష్ ను రప్పించిన కేసీఆర్ ఆయనను ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ని చేశారు. దీంతో ఆయన స్థానంలో కవిత రాజ్యసభకు వెళ్తారని చర్చ సాగింది. కానీ స్థానిక సంస్థల కోటా కింద ఆమె మళ్ళీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత  2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచారు. ఇక 2018లో రాష్ట్ర అసెంబ్లీ  లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కవిత కు ఎదురు దెబ్బ తగిలింది.

బిజెపి అభ్యర్థి అరవింద్ చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న భూపతి రెడ్డి  పార్టీ మారి ఆ పదవి పోగొట్టుకున్నారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2020 అక్టోబర్ 9న జరిగిన ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన కవిత  మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ గా గెలిచిన ఆమెను కెసిఆర్ మంత్రి వర్గంలోకి తీసుకుంటా రేమోనన్న  వార్తలు అప్పుడు వచ్చాయి. కానీ అలా చేస్తే విపక్షాల విమర్శలకు తవిచ్చినట్లవుతుందనే ఉద్దేశంతో కెసిఆర్ ఆగిపోయారని సమాచారం. కానీ ఇప్పుడేమో ఆమెను రాజ్యసభ ఎంపీగా చేయాలని కెసిఆర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగింది. కానీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. అదే నిజామాబాద్ గడ్డ పై తిరిగి విజయం సాధించి ప్రత్యర్థి పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె అనుకుంటున్నట్టుగా సమాచారం. ఒక వేళ ఆమె ఆలోచన అదే అయితే ఆరేళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారన్న అనుమానాలు  కలగడం ఖాయం. ఓ పదవితో స్థానికంగా రాజకీయాలు చేస్తే కలిసి వచ్చే చాన్స్ ఉందని ఆమె నమ్మి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో  నిలిచారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: