కరోణ వ్యాక్సినేషన్ ప్రపంచానికి సిరంజీ సంక్షోభాన్ని తీసుకురావచ్చు. వచ్చే ఏడాది  రెండు వందల కోట్ల  సూదుల కొరత ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కు సిరంజీలను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారని నివేదికలో ప్రస్తావించింది. మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లకుపైగా కరోణ వ్యాక్సిన్ లు ఇచ్చినట్లు అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. వీటిలో సింగిల్,డబుల్, బూస్టర్ డోసులు ఉన్నాయి.ఈ మొత్తం వ్యాక్సిన్ సాధారణంగా ఒక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం టీకాల కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రతి డోస్ కు ప్రత్యేక సిరంజీ ఉపయోగించబడుతున్నది. దింతో సిరంజీ వినియోగం ప్రతి ఏటా రెట్టింపవుతోంది. డబ్ల్యూహెచ్వో మెడికల్ అండ్ హెల్త్ ప్రొడక్ట్ యాక్సెస్ విభాగానికి సీనియర్ సలహాదారు లీసా హీడమాన్ వార్త సంస్థతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది నాటికి టీకా కోసం సిరంజిల కొరత ఉండవచ్చనేదీ మా ఆందోళన . ఇది టీకా వేగాన్ని తగ్గిస్తుంది.

అదే సమయంలో అనేక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించే ప్రయత్నాలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. డబ్ల్యుహెచ్వో నివేదిక ప్రకారం సిరంజిల ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది. ఎందుకంటే దాని కొరత విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. అదే సమయంలో సిరంజీల సరఫరా తగ్గినందున ప్రపంచ స్థాయిలో భయాందోళనలు కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్లు,సిరంజీల సరఫరా కూడా ఉత్పత్తి,వినియోగ స్థలం యొక్క దూరం పై ఆధారపడి ఉంటుంది.లీసా హీడ్ మాన్ మాట్లాడుతూ అవసరమైన కొరత ఉన్న సంకేతాలు నిజంగా కలవరపెడుతున్నాయని అన్నారు. సిరంజీల విషయానికొస్తే ఈ కొరత వంద నుంచి రెండు వందల కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు.సిరంజీల కొరతను సకాలంలో ఎదుర్కోవడానికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడితే రాబోవు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ దేశంలో ఏ విధంగా వేస్తారు అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: