గత ఎన్నికల దగ్గర నుంచి ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో, ఇక టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు అప్పగించాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందనే డిమాండ్లు ఎక్కువ వస్తున్నాయి. ఇటు ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్‌కు పార్టీ నడిపించే సత్తా లేదని, కాబట్టి ఎన్టీఆర్‌కు పార్టీ అప్పగించాలని ఫ్యాన్స్, కొందరు టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే కొంతకాలం ఎన్టీఆర్ టాపిక్ నడిచింది గానీ...ఆ మధ్య కాస్త తగ్గింది. ఎందుకంటే టీడీపీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. చంద్రబాబు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి టాపిక్ ఏపీ రాజకీయాలని కుదిపేసిన విషయం తెలిసిందే. భువనేశ్వరిపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు కూడా ఎప్పుడూలేని విధంగా కన్నీరు పెట్టుకున్నారు.

ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఘాటుగా స్పందిస్తూ..వైసీపీ నేతలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. కానీ ఎవరి పేరు చెప్పకుండా ఎన్టీఆర్ చాలా డిప్లమాటిక్‌గా మాట్లాడారు. ఇక ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ ఇంకా ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేశాయి. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య...ఎన్టీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడినా సరే ఎన్టీఆర్ ఘాటుగా స్పదించకపోవడం కరెక్ట్ కాదని, అలాగే హరికృష్ణ బ్రతికి ఉంటే పరిస్తితి వేరేగా ఉండదని, కొడాలి, వంశీలు ఎన్టీఆర్ చెప్పినట్లు వింటారని అన్నారు.

దీనిపై కొడాలి స్పందిస్తూ...ఎన్టీఆర్‌ మాట తాము వినమని, ఎన్టీఆర్‌కు తమకు సంబంధం లేదనట్లుగా ఆయన మాట్లాడారు. అయితే వర్ల వ్యాఖ్యలపై సొంత టీడీపీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఏదొక విధంగా ఎన్టీఆర్ స్పందించారని, దానిపై వర్ల రాజకీయం చేయడం కరెక్ట్ కాదని, కొందరు నేతలు హద్దులు దాటుతున్నారని, వారిని చంద్రబాబు కంట్రోల్‌లో పెట్టాలని అంటున్నారు. ఇలాగే మాట్లాడితే..ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఇంకా టీడీపీకి దూరమయ్యి, పార్టీకే డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: