ఆంధ్రావ‌నిలో రాజకీయం క్ష‌ణానికో తీరులో మారిపోతోంది. అందుకు అనుగుణంగా పార్టీలు వాటి సిద్ధాంత వైరుధ్యాలు అన్న‌వి మారిపోతున్నాయి. ఒక‌నాటి విలువ‌లు ఇప్పుడు లేవు అనడం క‌న్నా అస్స‌లు విలువల‌న్న‌వి లేకుండా ఉంటేనే రాజ‌కీయంలో నెగ్గుకు రాగ‌లం అన్న భావ‌న‌లో నేత‌లు ఉన్నారు. ఒక‌ప్పుడు ఏం తిట్టాల‌న్నా ఏం అనాల‌న్నా ఒక‌టికి వంద‌సార్లు ఆలోచించే నాయ‌కులను చూశాం. కానీ ఇప్పుడు అలా లేదు. నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట.. ఏం అనాలి అనిపిస్తే అది అని, త‌మ పంతం నెగ్గించుకుని రాజ‌కీయ నాయ‌కులు ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇవాళ ఏ పార్టీనో రేపు ఏ పార్టీనో తెలియ‌ని నాయ‌కులు కూడా మాట్లాడుతూ ఇత‌ర పార్టీ స‌భ్యుల‌ను తెలివిగా దూషిస్తూ పొలిటిక‌ల్ మైలేజీ పెంపొందించుకోవ‌డంలో ముందుంటున్నారు. ఆ విధంగా రాజ‌కీయం దిగ‌జారి నాయ‌కులు మాత్రం పైపైకి ఎదుగుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో నైతిక‌త అన్న‌ది ఓ అంద‌ని అర్థం కాని విలువే లేని ప‌దం.

ఒక‌ప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల‌లో కాస్తో కూస్తో హుందాగా ఉన్న నేత‌లు కూడా ఇప్పుడు మారిపోయారు. ఒక‌ప్పుడు కాస్తో  కూస్తో మంచి నాయ‌కులు అన్న క్లీన్ ఇమేజ్ ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు తెర‌మ‌ర‌గయిపోతున్నారు. తిట్ల‌తోనే మంచి పేరు తెచ్చుకోవాల‌ని మైలేజీ తెచ్చుకోవాల‌ని టీడీపీ నాయ‌కులు మాజీ మంత్రి అయ్య‌న్న భావిస్తున్నారా..లేదా తిట్ల‌తోనే మంచి పేరు వ‌స్తుంద‌ని, మైలేజీ పెరుగుతుంద‌ని మంత్రి కొడాలి నాని అనుకుంటున్నారా? ఒక‌నాడు రాజ‌కీయాల‌లో ఇంత‌టి దురుసుత‌నం, ఇంత‌టి నిర్ల‌జ్జ‌గా మాట్లాడిన నైజం ఉందా? పోనీ అలాంటివారిని పార్టీ అధినాయ‌క‌త్వాలు ప్రోత్స‌హించాయా? ఇవేవీ లేవు. ఏడాదంతా  రాజ‌కీయం న‌డ‌ప‌డం ఇప్పుడొక ఫ్యాష‌న్. ప్ర‌జా స‌మస్య‌ల‌పై మాట్లాడ‌క‌పోవ‌డం ఇప్పుడొక ఫ్యాష‌న్. ఈ క్ర‌మంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అయ్య‌న్న‌పై గుస్సాగా ఉన్నాయి సంబంధిత వ‌ర్గాలు. తాము ప్రాణాలను సైతం లెక్క చేయ‌కుండా విధి నిర్వ‌హ‌ణ చేస్తుంటే అస్స‌లు విలువే లేకుండా పోతోంద‌ని, టీడీపీ నాయ‌కుల అనుచిత వ్యాఖ్య‌లు త‌మ‌నెంతో  
బాధితున్నాయి అని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ క్ర‌మంలో అయ్య‌న్న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌ట్టుబ‌డుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: