మోడీ ప్రభుత్వానికి కొత్త చిక్కు. జాతీయ పార్టీల వలన ప్రజలు అనుకున్న సమయానికి ఆయా పనులు జరగటం లేదు. ఉదాహరణకు, ఒక జాతీయ పార్టీలో ఏదైనా ప్రాంత ప్రజలు తమకు ఒక రోడ్డు కావాలని కోరుకుని ఆ పార్టీ స్థానిక నాయకత్వాన్ని అడిగితే అది వెంటనే అయిపోతుంది, చేసేద్దాం అని చెప్పడానికి కానీ, చేసేయడానికి కానీ కుదరటం లేదు. కేవలం అదంతా అధిష్టానం చేతిలో ఉండటం దీనికి కారణం. ఏ చిన్న అభివృద్ధి పని చేయాలన్నా ఎప్పుడు అధిష్టానం అనుమతి అడగాల్సి వస్తుంది. అలా అడగటం లో సమయం పడుతుంది, అడిగినా జరుగుతుందనే నమ్మకం ఉండదు. వాళ్ళు దీనిపై అసలు ఎప్పుడు స్పందించేది కూడా తెలియనంత సమయం కూడా చాలా సార్లు పట్టవచ్చు. దీనితో జాతీయ నాయకత్వం పై రానురాను నమ్మకం సన్నగిల్లుతుంది. ఈ తప్పే దశాబ్దాల వరకు కాంగ్రెస్ లో కొనసాగుతూనే వచ్చింది.

ఆ పొరపాటును మరో జాతీయ పార్టీగా బీజేపీ చేస్తూనే ఉంటుందా, ఆ తీరు మార్చుకొని అధికార వికేంద్రీకరణ చేసి, ప్రజలకు దగ్గరవుతోందా అనేది ఇప్పటి బీజేపీ సమస్య. ఈ పరిస్థితిలో ఎంత త్వరగా మార్పులు వస్తే, అంత త్వరగా బీజేపీ బలపడే అవకాశం ఉంది. జాతీయ పార్టీకి ఉన్న ప్రాంతీయ నేతలకు అధికార వికేంద్రీకరణ ఇవ్వడం ద్వారా వాళ్ళు స్థానిక సమస్యలను తీర్చడానికి ముందుకు వెళ్తారు. తద్వారా స్థానికంగా ఉన్న ప్రజలలో మమేకం అవడం వాళ్లకు కూడా వీలుంటుంది. అది పార్టీని మూలాలనుండి బలోపేతం అవడానికి కారణం అవుతుంది. అయితే ఇందులో ఇంకో సమస్య కూడా లేకపోలేదు. ఆయా స్థానిక నేతలు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇచ్చిన నిధులను తమ జేబులలో వేసుకుంటే మాత్రం మెల్లి కాంగ్రెస్ పరిస్థితికే బీజేపీ చేరుకునే పరిస్థితి ఉంటుంది.  ఈ విషయంలో జాగర్తగా ఉంటె, పార్టీ బలోపేతం అంత కష్టం ఏమి కాదు.

ఇక కుటుంబ పార్టీలు, అంటే గతంలో వాళ్ళ ఇంటినుండి ఒక నేత రాజకీయాలలో ఉండటం, అదే బాటలో ఆ ఇంటి నుండి మరో నేత తయారవడం. ఇలాంటి పార్టీల కు ప్రజలు ఆకర్షితులు కావడానికి ఒక్కటే కారణం. ఆయా ప్రాంతాలలో నేతల వద్దకు వెళ్లి స్థానికులు పలానా సమస్య అని చెప్పుకోగానే, దాని పరిష్కారానికి వాళ్ళు అడుగులు వేయగలరు. అదే ప్రాంతీయ పార్టీల అసలు బలం. ఆ స్థాయికి జాతీయ నాయకత్వం కూడా అడుగులు వేయాలి. అప్పుడే ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టగలవు. ఈ అవకాశాన్ని జాతీయ పార్టీలు ఆదిపుచ్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: