పాకిస్తాన్ లో పరిస్థితులు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి నెలవుగా మారిపోయాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ విషయాన్నీ బాహాటంగానే ప్రపంచానికి తెలియజేశాడు. దీనిపై స్పందించిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా పాక్ ఇప్పటికే చాలా బాకీ పడింది, అవి తీర్చే పరిస్థితి కనిపించినప్పుడు కొత్త అప్పులు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది అని తేల్చి చెప్పేశాయి. ఇప్పటికే చైనా పుణ్యమా అని తీవ్రవాద దేశంగా పాక్ అంతర్జాతీయ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చేసుకుంది. అసలు అప్పులు కూడా దొరకకపోవడానికి ఇదే కారణం. అందుకే ఇక చేసేది లేక చైనాతో జట్టు కట్టాల్సి వచ్చింది. చైనా ఇచ్చిందే అప్పు, అది చేయమన్నదే పని అన్నట్టుగా ఆ రెండు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య ఒప్పందాలు కొనసాగాయి.

అయితే ప్రస్తుతం చైనా పరిస్థితి కూడా దిగజారిపోవడంతో చేసేది లేక పాక్ ప్రపంచం ముందు గోడు వెళ్లబుచ్చుకుంది. ఇప్పటికే ఈ క్యూ లో ఉన్న తాలిబన్ ఆఫ్ఘన్ కు ప్రస్తుతం పాక్ చేరింది. తాలిబన్ లకు కూడా ప్రాంతీయంగా శాంతి నెలకొనే వరకు, అలాగే ఆఫ్ఘన్ భూమిపై తీవ్రవాద సంస్థలు స్థావరంగా మారకపోతేనే ఆర్థికంగా ఏ సాయంగా చేసేది అని అంతర్జాతీయ సమాఖ్య స్పష్టం చేసింది. తాజాగా పాక్ కు కూడా అదే మరోసారి స్పష్టం చేసింది. వాళ్ళు ప్రపంచం చెట్టుకు పని చేస్తుంటే, దానిని మళ్ళీ ఆ ప్రపంచమే నిధులు ఇవ్వాలని అడగటం విడ్డురంగానే ఉన్నప్పటికీ, అడిగేవాడికి అలా అనిపించకపోవచ్చు. ఏది ఏమైనా చైనా అటు పాక్ ను ఇటు ఆఫ్ఘన్ ను, కరోనా పేరుతో ఎన్నో దేశాలలను, ఎంతో మందిని పొట్టనేసుకుంది.

ప్రపంచంలో రెండు దేశాలు తీవ్రవాదులకు నెలవుగా అవడంతో ప్రపంచం ఇప్పుడు ఎటువైపు నుండి ఎవడు స్లీపర్ సెల్ గా ఏ దాడి చేస్తాడో అని అనుక్షణం భయం భయంగానే కాలం గడుపుతుంది. ఒకపక్క కరోనా ను ఎదుర్కొంటు, మరో పక్క దేశాన్ని సాధారణ స్థితికి తెచ్చుకుంటూ, ఇంకో పక్క ఇలాంటి ఉగ్ర భూతాలనుండి దేశాన్ని కాపాడుకుంటూ అనుక్షణం జాగరూకతతో మెలగాల్సిన పరిస్థితిలో ప్రపంచం జీవనం సాగించాల్సి వస్తుంది. ఇదంతా గుప్పెడు తీవ్రవాదానికి బయపడి కొండంత దేశాలు పడుతున్న బాధ. వాళ్ళ అవసరాల కోసం వీళ్లు  తయారయ్యారు, ఇప్పుడు కొరకరాని కొయ్యగా మిగిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: