నారా భువనేశ్వరి ఇప్పటి వరకు ఆమె మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు సతీమణిగా ... లోకేష్ కు తల్లిగా మాత్రమే చాలా వరకు తెలుసు. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టిడిపి నేతలు ఆమెను ఎన్టీఆర్ కుమార్తె బాగా ప్రొజెక్ట్ చేశారు. ఎన్టీఆర్ కుమార్తె కు అసెంబ్లీ సాక్షిగా ఘోర అవ‌మానం జరిగిందన్న ప్రచారం ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. దీంతో ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. చంద్రబాబు సైతం తన భార్యకు ఏపీ అసెంబ్లీలో అవ‌మానం జ‌రిగింద‌ని బ‌య‌ట చెబుతున్నారు.

ఓవైపు వైసిపి వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. భువనేశ్వరి ని ఏమీ అనలేదు అని చెబుతున్నా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. భువనేశ్వరి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదని కోరుకున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆమె టిడిపి తరఫున రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తార‌న్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో తాను ఒక బాధిత మహిళనే అని చెప్పేందుకే ఇప్పుడు లేఖను విడుదల చేశారని అంటున్నారు. ఒకవేళ ఆమె రేపటి ఎన్నికల్లో ప్రచారం చేస్తే ప్రజలు ఎన్టీఆర్ కుమార్తె గా ఆదరించే అవకాశం ఉంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలయ్యతో పాటు పురందేశ్వ‌రి రాజకీయాల్లో ఉన్నారు.

రేపటి రోజున భువనేశ్వరి కూడా ప్ర‌చారం లోకి వస్తే అది టిడిపికి మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక జగన్‌కు ఎప్పటినుంచో తల్లి విజయలక్ష్మి తో పాటు షర్మిల ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కు కూడా భార్య తోడైతే సైకిల్ పార్టీకి బాగా లాభిస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. మ‌రి 2024 ఎన్నిక‌లు మాత్రం మాంచి ర‌స‌వ‌త్త‌రంగా ఉంటాయ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: