సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో కీల‌క మార్పులు చేశాక జ‌గ‌న్ ను అంతా కాక‌పోయిన చిల్ల‌ర క‌ల్యాణ్ లాంటి వ్య‌క్తులు మెచ్చుకుంటున్నా రు. తెలంగాణ‌లో కూడా మెచ్చుకుంటున్నారు. తెలంగాణ‌లో కూడా ఇలాంటి చ‌ట్టం ఒక‌టి తీసుకుని రావాల‌ని కోరుతున్నారు. అదేవి ధంగా ఆంధ్రాలో మాదిరిగానే తెలంగాణ‌లో కూడా టికెట్ రేట్లు త‌గ్గించాల‌ని కూడా విన్న‌విస్తున్నారు అక్క‌డి నిర్మాత‌లు కొందరు. అ యితే కొత్త స‌వ‌ర‌ణ అన్న‌ది ప్ర‌భుత్వంది కాద‌ని పరిశ్ర‌మకు చెందిన కొంద‌రు పెద్ద‌లు కోరిన మీద‌టే తాము ఈ మార్పులు తీసుకువ చ్చామ‌ని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. అంతేకాదు త‌మ ప‌రిధిలో ప‌రిశ్ర‌మ‌కు చేయాల్సినంత సాయం చేస్తూనే ఉంటామ‌ని, వీటిపై చ‌ర్చించేందుకు కూడా తాము సిద్ధ‌మేన‌ని కూడా అంటున్నారు. అయితే చ‌ర్చ‌ల స‌మ‌యం విష‌య‌మై ఏపీ స‌ర్కారును సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కోరితే త‌ప్ప‌క వీలు చూసుకుని అందుకు అంగీకారం తెలిపి సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల‌ను సీఎంకు నివేదిస్తామ‌ని కూడా అంటున్నారు గౌర‌వ మంత్రి.

ఇక టికెట్ రేటు విష‌య‌మై ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఎందుకంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మాకొక్క‌టే అన్న విధంగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంది. దీంతో పెద్ద సినిమాల‌కు, బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా  కొన్ని నియంత్ర‌ణ‌లు చేశారు. పెద్ద సినిమా విడుద‌ల స‌మ‌యంలో కూడా టికెట్ రేటు పెంచుకునేందుకు వీల్లేద‌ని, అదేవిధంగా బెనిఫిట్ షో లు వేసుకునేందుకు వీల్లేద‌ని చెబుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. అలానే టికెట్ అమ్మకాలు అన్నీ ఇక‌పై కౌంట‌ర్ సేల్ కాకుండా ఆన్ లైన్ ద్వారానే అదీ ప్ర‌భుత్వం విధింంచిన నియ‌మాల‌కు అనుగుణంగా రూపొందిన వెబ్సైట్ ఆధారంగానే జ‌ర‌పాల‌ని చెబుతున్న స‌ర్కారును తామెలా అర్థం చేసుకోవాలో తెలియ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.



చిన్న చిత్రాల విష‌య‌మై ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం బాగానే ఉన్నా, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌పై ఈ నిర్ణ‌యం అస్స‌లు బాలేద‌ని., వ‌ర్కౌట్ కాద‌ని కూడా అంటున్నాయి నిర్మాణ వ‌ర్గాలు. ఈ త‌రుణంలో చిన్న చిత్రాల‌కు ట్యాక్స్ ఎగ్జ‌మ్ష‌న్స్ కూడా ఇస్తే ఇంకా బాగుండేద‌ని కూడా అడుగుతున్నాయి. ఏపీలో చిత్రీక‌ర‌ణ‌లు జ‌రిగేందుకు సంబంధిత ప్రోత్సాహ‌కాలు ఇస్తే ఇంకా బాగుండు అని కూడా నివేదిస్తున్నాయి. ఇవేవీ జ‌ర‌గ‌కుండా థియేట‌ర్ ఆదాయం మాత్ర‌మే త‌మ‌కు ద‌క్కేలా అదే పెద్ద వ‌న‌రు ఉప‌యోగించు కోండని చెబితే తామెలా ఈ ప్ర‌భుత్వాన్ని అర్థం చేసుకోవాల‌ని కూడా అంటున్నాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక సినిమా లైఫ్ టైం వారం రోజులు మాత్ర‌మే అని అంటున్నారు కొంద‌రు. ఇంకా చెప్పాలంటే శుక్ర‌వారం విడుద‌ల‌యిన సినిమా జీవితం వీకెండ్ బాగుంటే బాగుంటుంద‌ని, ఆ విధంగా చూస్తే వీకెండ్ తో క‌లుపుకుని చూస్తే..ఆయా స‌మ‌యాల్లో క‌లెక్ష‌న్లు బాగుంటే శుక్ర,శ‌ని, ఆది వారాలతోనే క‌లెక్ష‌న్ల లెక్క తేలిపోతుంద‌ని కూడా వీరంతా వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కొన్ని వ‌రాలు ఇచ్చి ఆదుకుంటే సీఎం జ‌గ‌న్ నిజంగానే త‌మ పాలిట హీరోనే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp