ఏపీలో ప్రతిపక్ష టీడీపీ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నయుడు నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు మంత్రిగా ఉండి కూడా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి ని అభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉన్న మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు పై అనేక సందేహాలు కూడా కలిగాయి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఆయ‌న మంగ‌ళ‌గిరికి దూరంగా ఉంటూ వచ్చారు. మంగళగిరి నుంచి పోటీ ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేయ‌ర‌ని... ఆయన కొత్త నియోజకవర్గం ఎదుర్కొంటారని కూడా వార్తలు వస్తున్నాయి.

కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు - గుంటూరు జిల్లా లోని పెద‌కూర‌పాడు - విశాఖ జిల్లాలోని భీమిలి పేర్లు ఈ లిస్టులో వినిపించాయి. ఇక కుప్పం లో చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే ఇది చాలా తక్కువ మెజారిటీ. కుప్పంలో చంద్రబాబుకు ఎప్పుడు 45 నుంచి 50 వేల మెజార్టీ వచ్చేది.

అలాంటిది గత ఎన్నికల్లో కేవలం 30 వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ - జడ్పిటిసి ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడి పోయింది. చంద్రబాబు - లోకేష్ ప్రచారం చేసినా కూడా కుప్పం మున్సిపాలిటీ ని కూడా టీడీపీ గెలుచుకో లేకపోయింది. చంద్రబాబు కంచుకోట కుప్పం పునాదులు కూడా కదిలి పోవడంతో ఇప్పుడు చంద్రబాబు కూడా కొత్త నియోజకవర్గం ఎదుర్కొంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు కూడా కృష్ణా - గుంటూరు జిల్లాలో పెనమలూరు లేదా పెదకూరపాడు నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని టిడిపి లో చర్చలు నడుస్తున్నాయి. అయితే కుప్పం లో గ‌త మునిసిప‌ల్ ఎన్నికల్లో వైసిపి అధికార బలంతో గెలిచిందని... వచ్చే సాధారణ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబుకు అక్కడ తిరిగి ఉండదని... తమ నేత అక్కడ నుంచి పోటీ చేస్తారని స్థానిక నేతలు చెబుతున్నారు. మంగళగిరిలో లోకేష్‌ యాక్టివ్ కావడంతో అక్కడ నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: