కృష్ణాజిల్లా గుడివాడ రాజకీయాల్లో రావి కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఆ కుటుంబం నుంచి దివంగత నేత రావి శోభనాద్రి చౌదరి తో పాటు ఆయన కుమారులు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. రావి శోభనాద్రి చౌదరి అనంతరం ఆయన పెద్ద కుమారుడు రావి హరగోపాల్ 1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే ఆయ‌న‌ రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు.

గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ అయ్యాక రావి ఫ్యామిలీ ఇమేజ్ కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004 లో నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వర రావు ని కాదని చంద్రబాబు కొడాలి నాని కి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గుడివాడ రాజకీయాల్లో నాని బ‌లంగా పాతుకు పోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2004 - 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచిన నాని ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు.

వైసీపీ నుంచి 2014 - 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు రావి వెంకటేశ్వరరావుకు టిక్కెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు విజయవాడ నుంచి దేవినేని అవినాష్ ను గుడివాడ లో దింపారు. ఇప్పుడు అవినాష్ పార్టీ మారాక మళ్లీ రావికే గుడివాడ ప‌గ్గాలు ఇచ్చారు.

అయితే వచ్చే ఎన్నికల్లో రావికి టిక్కెట్ ఇవ్వ‌రు అని తెలుస్తుంది. అక్కడ నుంచి విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రావి వెంకటేశ్వరరావు కు మరోసారి షాక్‌ తప్పేలా లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న రావికి టిక్కెట్ రాలేదు. రేప‌టి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌నే ఇక్క‌డ ఇన్‌చార్జ్ గా ఉన్నా టిక్కెట్ వ‌చ్చేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: