ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు నుంచి కేవలం తన కేంద్రీకృతంగా నే పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. జగన్ ముందు నుంచి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ జనాలు త‌న‌ను చూసి ఓట్లు వేసి గెలిపిస్తార‌న్న‌ నమ్మకం బలంగా వచ్చేసింది. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జగన్ కు ప్రజల్లో రోజురోజుకూ క్రేజ్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యేలు - జగన్ కు మధ్య గ్యాప్ వచ్చేసింది.

చివ‌ర‌కు ఎమ్మెల్యే ల‌ విజ్ఞప్తులను కూడా జగన్ ప‌ట్టించుకోని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలకు తమతమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న వినతులను కూడా ముఖ్యమంత్రి వినే టైం వారికి ఇవ్వటం లేదు. చాలా నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా ఎమ్మెల్యేలు చేయలేని పరిస్థితి ఉంది. కేవలం సంక్షేమ పథకాలతో నే జనాలు ఓటేస్తార‌న్న భావ‌న జగన్ లో ఉండడంతో ఎమ్మెల్యేల మాటకు విలువ ఇవ్వడం లేదు.

ఇదిలా ఉంటే పార్టీలో సీనియర్ గా ఉన్న నేతలకు సైతం ప్రయారిటీ ఉండటం లేదన్న ఆవేదన చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. ఈ క్రమంలో నే పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు - మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి - మానుగుంట మహీధర్రెడ్డి ఇద్దరు కూడా జగన్ తీరుపై తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈసారి జరిగే ప్రక్షాళనలో తమ ఇద్దరికీ మంత్రి పదవి దక్కక పోతే వచ్చే ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వీరిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని జ‌గ‌నే స్వ‌యంగా జిల్లా నేత‌ల‌కు కూడా చెప్పిన‌ట్టు టాక్ ?  చివ‌ర‌కు అధికారులు కూడా వీరి నియోజ‌క‌వ‌ర్గాల్లో మాట విన‌డం లేదు. ఈ ఇద్దరు నేతలకు మంత్రి పదవులు రాకపోతే ఎన్నికలకు ముందు జగన్ పై తీవ్ర విమర్శలు చేసి మరి పార్టీని వీడతారని అంటున్నారు. మరి వీరు అప్పటి వరకు పార్టీలో ఉంటారా లేదా ముందే బ్లాస్ట్ అవుతారా ? అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: