ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.  రానున్న బడ్జెట్ సమావేశాల్లో  రాష్ట్ర  ప్రభుత్వం  కొత్తగా రాజధాని చట్టాన్ని ప్రవేశ పెట్టనుందా ? ప్రస్తుత పరిస్తితులు చూస్తే అలా అనిపించడం లేదు.  వరుస వెంబడి వస్తున్నతుఫాన్లు, ఇప్పటికే  ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసిన వరదలు ప్రభుత్వం పై పరోక్షంగా వత్తిడి పెంచాయి. పాలనా పరమైన పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రజాసంక్షేమం పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. దీంతో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  బడ్జెట్  సమావేెశాల తరువాత పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్  మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఓ  ప్రకటన చేశారు. అది చాలా మందికి గుర్తుండే ఉంటుంది.  మంత్రి వర్గం లో బెర్తు సంపాదించాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే  రాజ్యాంగ నిబంధన ప్రకారం కొద్ది మందికే అమాత్య పదవులు దక్కుతాయి.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రులందరినీ మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తాం అని  వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆనాడు ప్రకటించారు.  అంటే ఇప్పుడున్న మంత్రులందరూ మారుతారు. కొత్త మంత్రి మండలి ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది.  తొలుత దీనిని సరిదిద్దాలి. తరువాత మంత్రి మండలిని కొత్తవారితో ఏర్పాటు చేయాలి.

ఇదెప్పుడు జరిగే అవకాశం ఉంది.  బడ్జెట్ సమావేశాల అనంతరమే మంత్రి మండలి మార్పు ఉండే అవకాశం ఉంది.  బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా ఉంటేనే పరిపాలన సాఫీగా సాగుతుంది.   దీంతో రానున్న బడ్జెట్ సమావేశాలు ఈ మంత్రి మండలితోనే కొనసాగించే అవకాశం ఉంది. ఈ లోపు  రాజధాని వికేంద్రీకరణ బిల్లు తిరిపి సభలోకి వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ బిల్లుపై  సుధీర్ఘంగా చర్చించాలని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం శాసన మండలి లోనూ పూర్తి స్థాయిలో బలం ఉన్నందున ఇక నుంచి ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశ పెట్టిన సునాయాసంగా  చట్టం అవుతుంది. ఎటోచ్చీ చిక్కంగా న్యాయస్థానాల నుంచే. దీంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  అన్నికోణాల నుంచి చర్చించి  పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సభ ముందుకుతీసుకు రానున్నారు.   బడ్జెట్ సమావేశాలకు మూడు నాలగు నెలల మాత్రమే సమయం ఉన్నందకున  ఆ సమావేశాల్లో పరిపాలనా వికేంద్రీ కరణ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.  బడ్జెట్ సమావేశాల తరువాత కొత్త మంత్రి మండలి ఏర్పాటవుతుంది.  అప్పటికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు ముసాయిదా రెడీ అయ్యే అవకాశం ఉంది. దీంతో  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  కొత్త మంత్రి వర్గం తరువాతనే కొత్త బిల్లు ప్రవేశ పెట్టే అవాశాలున్నాయి.

.

మరింత సమాచారం తెలుసుకోండి: