తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి  టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని అధిష్టానం ప్రకటించి ఊపిరి పోసిందని కొంద‌రూ రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ  రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి విముఖతతో ఉన్న సీనియర్‌ నేతల‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకరు. అయితే ఆనాటి నుంచి మొన్నటి హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే ప‌లు మార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేసారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో క్యాడర్‌లో కూడా కొంచెం అస్పష్టత మొదలైన‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.  హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల తరువాత నిర్వహించిన త‌రువాత ఇటీవ‌ల‌ పీఏసీ సమావేశంలో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌ కాంగ్రెస్‌ నేతలందరికీ గట్టిగానే వార్నింగ్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్‌ కార్యకర్తల్లోకి ప్రతికూల సాంకేతాలు  వెళ్తున్నాయ‌ని గ్రహించిన పార్టీ సీనియర్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి ల మధ్య సయోధ్య కుదిర్చే పనినీ భుజానికెత్తుకున్నారు. ముఖ్యంగా వీహెచ్ హ‌న్మంత‌రావు వీరిద్ద‌రిని క‌లిపార‌ని తెలుస్తోంది.

అయితే కోమటిరెడ్డితో మాట్లాడే బాధ్యత వీహెచ్‌ లాంటి సీనియర్లపైనే పెట్టింది అధిష్టానం. ఇదిలా ఉండ‌గా..  ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్‌’ అంటూ ఇవాళ‌ కాంగ్రెస్‌ వరి దీక్షలకు దిగింది. ఈ త‌రుణంలోనే  హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద వరి దీక్షలు చేపట్టింది. అయితే దీక్షలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాల్గొనడంతో కొంత సేపు కార్యకర్తలందరూ సంభ్రమాశ్చర్యాలకు గుర‌య్యారు.

అంతేకాకుండా కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డి పక్కపక్కనే కూర్చొవ‌డం.. రేవంత్‌రెడ్డి కోమ‌రెడ్డి భుజంపై చేయి వేసి ముచ్చ‌టించ‌డంతో  ఇక కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండిందనే చెప్పాలి. ఎప్పటి నుంచే కొంత అస్పష్టతతో ఉన్న కార్యకర్తల్లో ఉన్న అనుమానంను ఈ రోజు వరి దీక్ష వేదిక నుండి కోమటిరెడ్డి, రేవంత్‌ రెడ్డిలు తరిమికొట్టారని ప‌లువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: