గత కొన్ని రోజుల నుంచి రష్యా అగ్రరాజ్యమైన అమెరికా మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం మరికొన్ని రోజుల్లో ఏకంగా ఆయుధ యుద్ధం జరగబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రష్యా వ్యవహారశైలిపై అటు అగ్రరాజ్యమైన అమెరికా తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉంది. ప్రస్తుతం  నక్క జిత్తుల మారి చైనా విస్తరణ  ధోరణితో ముందుకు సాగుతూ తైవాన్ ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు గానే అటు రష్యాకు కూడా ఉక్రెయిన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.



 ఈ క్రమం  లోనే యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశం గా ఉన్న ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తూ ఉండడంపై ఇక అమెరికా సహా మిత్ర దేశాల మొత్తం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రష్యా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ ను దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి యూరోపియన్ యూనియన్ దేశాలు. ఒకప్పటిలా యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉన్నా పర్వాలేదు లేదా స్వతంత్ర దేశంగా ఉండాలి అనుకుంటే అలాగే ఉండాలి కానీ.. యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.



అంతేకాదు ఏకంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్షల మంది సైనికులను కూడా అమెరికా మోహరించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం సైనికులు మాత్రమే కాదు సరిహద్దుల్లో అణు ఆయుధాలను కూడా మోహరించింది అన్న వార్తలు ప్రస్తుతం సంచలనం గా మారిపోతున్నాయి. రెండు వైపుల నుంచి రష్యాపై అణు ఆయుధాలతో దాడి చేయబోతున్నారు అంటూ అక్కడి నిపుణులు గ్రహించినట్టు తెలుస్తోంది. అందుకే రష్యా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని అక్కడి రక్షణ రంగ నిపుణులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: