ప్రస్తుతం వన్ చైనా పాలసీతో ముందుకు సాగుతున్నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. చైనా సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న దేశాలు మొత్తం తమ దేశం లో భాగంగా మార్చుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హాంకాంగ్ లాంటి స్వతంత్ర దేశాల ను కూడా చైనాలో విలీనం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనాకు పొరుగు దేశమైన తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా ఎన్నో రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఏకంగా తైవాన్ సరిహద్దుల్లో ఏకంగా యుద్ధ వాతావరణాన్ని కూడా సృష్టించింది చైనా.



ఇక ఇటీవలే తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను కూడా మోహరించడం సంచలనంగా  మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక అయితే తైవాన్ కూడా తమ దేశంలో భాగం అంటూ చైనా చెబుతుంటే... తాము స్వతంత్ర దేశం అంటూ ఎప్పుడూ చైనా కు కౌంటర్ ఇస్తూ వస్తుంది తైవాన్. అటు అమెరికా కూడా తైవాన్ కు మద్దతు తెలుపుతూ ఉండటం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వెనక్కి తగ్గాలని లేదంటే ఊహించని పరిణామాలు ఉంటాయి అంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తైవాన్ ని స్వాధీనం చేసుకునేందుకు చైనా పన్నుతున్న వ్యూహాలకు చెక్ పెట్టేందుకు అమెరికా ప్రస్తుతం మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.



 ప్రస్తుతం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న తైవాన్ కు కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం వచ్చే విధంగా చేయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది  దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించింది అగ్రరాజ్యమైన అమెరికా. ఇలా చేయడం వల్ల అటు చైనా తైవాన్ ను స్వాధీనం చేసుకోవాలి అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా చైనా ను తప్పు పట్టే అవకాశం ఉందని అందుకే తైవాన్కు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కల్పిస్తే ఒక ముప్పు నుంచి బయట పడేసి నట్లే అని అమెరికా భావిస్తోందట. అందుకే చిన్న దేశమైన తైవాన్ కు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కల్పించాలని చూస్తుందట అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి: