ఏపీ పాలిటిక్స్ లో విక్టరీ అన్న మాటకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు జగన్. 2019లో అద్భుత విజయం తో అధికారం కైవసం చేసుకున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నాలు ఓ వైపు, పగబట్టిన కరోణ మరోవైపు. రెండున్నరేళ్లు చిటిక వేసినట్లుగా గడిచిపోయాయి. ఎన్నికల ముందు జనాల్లోనే ఎక్కువగా కనిపించిన జగన్ కారణం ఏదైనా ప్రజా క్షేత్రానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ మారింది వైసీపీ సర్కార్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేవడమే కాదు, జనాల్లోకి వెళ్లేందుకు విపక్షాలు గేర్ మార్చాయి. ఇలాంటి సమయంలో జగన్ కూడా జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏమైందో ఏమో కానీ ఆ వ్యూహం కాస్తా ప్రయత్నం దగ్గర ఆగిపోయినట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే కాదు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అదిరిపోయే విజయాలతో వైసిపి దూసుకుపోతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టిడిపికి వైసిపి ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు ఇలా విజయాలన్నింటినీ కట్టగట్టి  భుజం మీద వేసుకొని తాడేపల్లి కాంపౌండ్ లోకి వెళ్లారు జగన్. అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. జనవరి నుంచి ప్రజా యాత్ర లకు టిడిపి సిద్ధమవుతోంది.

 అందుకోసం జగన్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ డిసెంబర్ నుంచే జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తారని ఆ మధ్య ఓ టాక్ నడిచింది. కానీ జగన్ ఇప్పటివరకు రోడెక్కింది లేదు పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్ లేదు. అసెంబ్లీ పరిణామాల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. జనాల్లోకి వెళ్లేందుకు మరిన్ని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ ను హీరో చేసింది, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్రే. పల్లె పల్లెకు నడిచి వెళుతూ ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించారు. అంతకుముందు ఆయన చేసిన ఓదార్పుయాత్ర ఆయనను ప్రజల మనిషిని చేసింది. జనంలోనే ఉన్న మనిషి జనం లా ఉన్న మనిషి ఎందుకిలా దూరంగా ఉంటున్నారు. పగపట్టాయి అన్నట్లు కనిపించిన పరిణామాల తర్వాత ఇప్పుడు జనం చిన్న ఓదార్పు కోరుకుంటున్నారు. జగన్ మళ్లీ జనాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని వైసిపి నేతలు  భావిస్తున్నారు. జనంలో కనిపించడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టాలన్న జనం- జగన్ జంట పదాలు అన్న పేరు మళ్ళీ గుర్తుకు రావాలంటే జగన్ తాడేపల్లి ని విడిచి పెట్టి జనాల్లోకి రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: