ఇప్ప‌టిదాకా రాజ‌కీయం వేరు
ఇక‌పై రాజ‌కీయం వేరు అని
అనుకోవ‌డానికి జ‌గ‌న్ కు
ప‌వ‌న్ కు ఇంకా ఇంకొంద‌రికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్టేలా లేదు

అవ‌మానాన్ని ఆయుధంగా మలుచుకోవ‌డం జ‌గ‌న్ కు తెలుసు. అవ‌మానాన్నీ అందులో ఆడ బిడ్డ‌కు జ‌రిగిన అవ‌మానాన్నీ (జ‌రిగిందా లేదా అన్న‌ది వైసీపీ ఇప్ప‌టికే ఓ స్పష్ట‌త ఇచ్చింది..ఒక‌వేళ అది చంద్ర‌బాబు ఆరోప‌ణ అయితే ఏం చేయ‌లేం) త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకునే చాణ‌క్యం, చాక‌చ‌క్యం చంద్ర‌బాబులోనే ఉండాలిక. ఎందుకంటే తాము ఏమీ అన‌లేద‌ని వైసీపీ నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా కూడా అదేమీ ఫ‌లించేలా లేదు. దీంతో  సానుభూతి రాజ‌కీయం న‌డ‌పాల‌న్న యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. అందుకే త‌న‌దైన శైలిలో ఎన్న‌డూ లేని విధంగా త‌న భార్య భువ‌నేశ్వ‌రిని సీన్ లోకి తెస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సీన్ ఒక‌లా ఉంది. ఇప్పుడు మ‌రోలా ఉండ‌బోతోంది.


ఆడ‌వాళ్ల‌ను ప్రచారంలోకి తెచ్చి గతంలో జ‌గ‌న్ ఈ మ‌ధ్య కాలంలో ఈటెల బాగానే స‌క్సెస్ అయ్యారు. జ‌గ‌న్ మెయిన్ క్యాంపైన‌ర్ గా ష‌ర్మిల ఉన్నారు. భార‌తి మ‌రియు విజ‌య‌మ్మ కూడా ఉన్నారు. దీంతో జ‌గ‌న్ కు చాలా కలిసివ‌చ్చింది మొన్న‌టి ఎన్నిక‌ల్లో! వీటితో పాటు కొన్ని టెక్నిక్స్ కూడా బాగానే ప‌నిచేశాయి. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా త‌న ఇంటి ఆడ‌వాళ్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వినియోగించుకుని సానుభూతి పొందాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. సో..అన్నీ కుదిరితే వ‌చ్చే ఎన్నిక‌ల సంద‌ర్భంగా  భువ‌నేశ్వ‌రి ప్ర‌చారం చేయ‌డం ఖాయం.


అన్న గారి కూతురిగా, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ గా భువ‌నేశ్వ‌రి ఇప్ప‌టికే చాలా మందికి ప‌రిచ‌యం ఉన్న పేరు. ఇప్ప‌టికే ఆమె సోద‌రి పురంధ‌రి రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. కొంత కాలం కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ లోనూ ఉంటూ రాజ‌కీయం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగానూ ప‌నిచేసి మంచి పేరే తెచ్చుకున్నారు. వాగ్ధాటి ఉన్న నేత‌గా పురంధ‌రికి చాలా క్రేజ్ కూడా ఉంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ పురంధ‌రి ఢిల్లీ కేంద్రంగా రాజ‌కీయం న‌డిపి, త‌న‌వంతుగా చెప్పాల్సిన‌దేదో అధిష్టానానికి చెప్పే వచ్చారు. ఇప్పుడీమె స్ఫూర్తితో రంగంలోకి దిగాల‌ని భువ‌నేశ్వ‌రి భావిస్తున్నారు. ఒక‌టి రెండు మీడియా స‌మావేశాల్లో ఆమె మాట్లాడిన తీరు ప్రకారం పెద్ద‌గా వాగ్ధాటి లేక‌పోయినా స‌రే! ఆమె ప్ర‌చారం కొంత‌లో కొంత పార్టీకి క‌లిసివ‌స్తుంద‌న్న ఆశాభావంలో ఉన్నారు చంద్ర‌బాబు. ఆమెకు తోడుగా కోడ‌లు బ్రాహ్మ‌ణి ఉండ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp