భార్య భర్తల బంధం అన్న తర్వాత చిన్నపాటి గొడవలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు క్షణికావేశంలో భర్తను భార్య పై చేయి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని సార్లు భర్త భార్య పై చేయి చేసుకోవడం మాత్రం నేటి రోజుల్లో గృహహింస చట్టం కింద వస్తుంది అని చెప్పాలి. ఎంతోమంది మహిళలు భర్త చేయి చేసుకున్నాడు అంటే చాలు ఇక మహిళా సంఘాలను ఆశ్రయిస్తూ ఏకంగా భర్తను జైలుకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.



 ఇక ఇటీవల  సినిమాల్లో చూసుకుంటే ఒకప్పుడు భర్తలు భార్యలను కొట్టే సమయం పోయి భర్తలను  భార్యలు కొట్టె సమయం వచ్చిందని  చెబుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది భార్యా బాధితులు తెర మీదికి రావడం చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు అసలు భార్య భర్త కొట్టుకోవడం  గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. సాధారణంగా ఇటీవలికాలంలో మహిళలు భర్త  చేయి చేసుకున్నాడు అంటే చాలు గృహహింస చట్టం కింద కేసు పెడుతున్నారు. కానీ చాలా మంది మహిళలు భర్తలు కొట్టడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట.


 ఇది ఎవరో చెప్పింది కాదు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడయిందట. భార్యను భర్త కొట్టడం కరెక్టేనా అనే ఒక ఆసక్తికర సర్వే నిర్వహించగా అంతకుమించిన ఆసక్తికర రిజల్ట్ వచ్చింది. మెజారిటీ మహిళలు భర్త భార్యను కొట్టడం కరెక్టే అని చెప్పారట. ఇక అత్యధికంగా తెలంగాణ లో 83.8 శాతం మంది మహిళలు భర్త భార్యను కొట్టడం లో తప్పు లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 83.6 శాతం మంది మహిళలు ఈ విషయాన్ని ఒప్పుకున్నారట. కర్ణాటకలో 76. 9%, మణిపూర్లో 65.9%, కేరళలో 52.4 మంది మహిళలు భర్తలు కొట్టడంతో తప్పులేదని అభిప్రాయం వ్యక్తం చేశారట. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం 14.8 శాతం మహిళలే దీనికి ఒప్పుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: