వరి పంట పై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. యాసంగి లో వరి పంట వేయవద్దని ఒకవేళ వేసినా కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ దీనిపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనబోమని కేంద్రం తేల్చేసింది. తనతో భేటీ అయిన తెలంగాణ మంత్రుల బృందానికి  పీయుష్ గోయల్ తేల్చి చెప్పారు.  ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విధంగా డిమాండ్ ఉంటుందని గత నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరించామని ఇప్పటినుండి కొనబోమని చెప్పింది. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వెయ్యాలని కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. యాసంగి న వరి వేయొద్దనే మాట వారి చాలా గట్టిగా చెప్పారని నిరంజన్ రెడ్డి  చెప్పారు. మరి మీ వాళ్లే గందరగోళం చేసారని ఆయన అంటే  వారు తెలిసో తెలియకో అన్నారని ఆ రకంగా మాట్లాడవద్దని మేము చెప్పామని అన్నారు.

ఇప్పుడు దాని గురించి మావాళ్లు ఏమి మాట్లాడం లేదని పీయుష్ గోయల్ చెప్పడం జరిగింది. బాయిల్డ్ రైస్ మేము భవిష్యత్తులో తీసుకోము కాబట్టి వరి వేయొద్దని చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి చెప్పారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.80,85 లక్షల మెట్రిక్ టన్నులు  కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తామని గత సమావేశంలో చెప్పారని, ఇప్పుడేమో ఏడాది టార్గెట్ ఇప్పుడెలా చెబుతామని దాటివేసే ధోరణిలో మాట్లాడుతోంది.  నిర్దిష్టంగా ఎంత ధాన్యాన్ని తీసుకుంటారో కేంద్రం చెప్పడం లేదు.  ఓవైపు కొనుగోళ్లు జరుగుతుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చెప్పలేని దయనీయస్థితిలో ఉంది కేంద్రం. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం తెలంగాణ కు లేఖ ఇచ్చింది. గతంలో తెలంగాణ నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల ని నిర్ణయించింది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ధాన్యం,బియ్యం సేకరణ జరుగుతున్నట్లు  కేంద్రం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: