ఇటీవల ఏపీ రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు చంద్రబాబుని తిట్టే క్రమంలో...ఆయన సతీమణి భువనేశ్వరిని కూడా రాజకీయాల్లోకి లాగిన విషయం తెలిసిందే. ఇక ఆమెని ఉద్దేశించి ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. అలాగే ఆ అంశంపై చంద్రబాబు కన్నీరు పెట్టడం కూడా జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది.

ఫ్యామిలీ మొత్తం బాబుకు మద్ధతు ప్రకటించి...వైసీపీ నేతలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి టీడీపీకి ఇంకా మద్ధతు పెరగాల్సిన అవసరముందనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వస్తుంది. మొదట నుంచి ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఇప్పటిలో పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

అసలు ఫ్యామిలీ నుంచి ఏపీలో బాలకృష్ణ ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు తెలంగాణలో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని రాజకీయం చేస్తున్నారు. అయితే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకొందరు పార్టీలోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వస్తుంది. చైతన్య కృష్ణ, తారకరత్న లాంటి వారు పార్టీలోకి వస్తే...నందమూరి ఫ్యామిలీ మద్ధతు మరింత పెరిగినట్లు అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఇప్పటిలో రాజకీయాల జోలికి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో వేరే వాళ్ళు పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు.


అదే సమయంలో తెలంగాణలో ఎలాగో పార్టీ సరిగ్గా లేదు కాబట్టి..సుహాసినిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొస్తే బెటర్ అని అంటున్నారు. ఆమెని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి...వంశీ, కొడాలి నాని లాంటి వారిపై పోటీ పెడితే కాస్త రాజకీయం మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కొడాలి, వంశీ లాంటి వారికి మామూలు నేతలతో చెక్ పెట్టడం సులువు కాదని, నందమూరి ఫ్యామిలీ నుంచి పోటీ పెడితేనే బెటర్ అని అంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు రాజకీయాల్లోకి వస్తారో?  


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp