వచ్చే ఎన్నికల్లో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు దక్కడం కష్టమేనా? అంటే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో కొందరికి మళ్ళీ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అలాగే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది. అటు టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ-జనసేనలు పొత్తు ఉంటే..అందుకు తగ్గట్టుగా వైసీపీ వ్యూహాలని మార్చి అభ్యర్ధులని నిలబెట్టాల్సిన పరిస్తితి ఉంది.

2019 ఎన్నికల్లో జగన్ అదే చేశారు...2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన అభ్యర్ధుల్లో కొందరికి 2019 ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు. పరిస్తితులకు తగ్గట్టు వ్యూహం మార్చి అభ్యర్ధులని రంగంలోకి దింపి విజయం సాధించారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఇలాంటి సమీకరణాలతోనే జగన్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో మార్పులు తప్పనిసరి అని తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో సీటు డౌటే అని చెప్పొచ్చు. ఈమెపై ఎంత వ్యతిరేకత పెరిగిందో చెప్పాల్సిన పని లేదు. పైగా అమరావతి అంశం ఫుల్ నెగిటివ్. కాబట్టి ఇక్కడ వైసీపీ తరుపున స్ట్రాంగ్ అభ్యర్ధిని నిలబెట్టే ఛాన్స్ ఉంది. మంగళగిరి సీటు మార్చే అవకాశం లేదు.


 అటు పొన్నూరులో ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కూడా నెక్స్ట్ ఛాన్స్ కనబడటం లేదు. బలమైన ధూళిపాళ్ళ నరేంద్రకు చెక్ పెట్టాలంటే ఈ సారి రోశయ్య బలం సరిపోదు. కిందటి సారి అంటే జగన్ గాలి ఉంది కాబట్టి గెలిచేశారు. ఈ సారి మాత్రం కష్టమే. అందుకే రోశయ్యకు సీటు డౌటే. అలాగే గుంటూరు వెస్ట్‌లో టీడీపీ తరుపున గెలిచి వైసీపీలోకి వచ్చిన మద్దాలి గిరికి కూడా సీటు ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. మొత్తానికైతే అమరావతి పరిధిలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల సీట్లు చిరగడం ఖాయమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: