- కూర్పు : ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

కోవిడ్ వ‌చ్చినా దేవుడే దిగివ‌చ్చినా తెలుగు ప్రేక్ష‌కుడు త‌గ్గేదేలా అని అన్నాడు బ‌న్నీ (పూర్తి పేరు రాయాలా? ఎందుక‌ని )..త్వ‌ర‌లో ఆచార్య వ‌స్తుంది. పుష్ప వ‌స్తుంది.. ప్ర‌పంచం గ‌ర్వించే స్థాయి ద‌ర్శ‌కుడి నుంచి ఆర్ఆర్ఆర్ వ‌స్తుంది. వీటికి ఆల్ ద బెస్ట్.. భాషా భేదం లేని సినిమాకు ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు బాల‌య్య.  ప‌సి మ‌న‌సుతో స‌హృద‌యావ‌ర‌ణ  నుంచి ప‌లికిన మాట‌ల‌వి అని అన్నారు మ‌రో అతిథి.. ఆనందించాడు అభిమాని. మ‌ళ్లీ అనండి జై బాల‌య్య అని! ర‌క్తం పంచుకు పుట్టిన బిడ్డ‌లు ర‌క్తం ఇచ్చిన అభిమానులు వీళ్లిద్ద‌రూ ఒక్క‌టే.. ఆల‌యం లాంటి ఆస్ప‌త్రి బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రికి అనంత‌పురం నుంచి అభిమానులు వ‌చ్చి ర‌క్త‌దానం చేసి వెళ్లారు. కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు బాల‌య్య.. అమ్మ పేరిట‌త క‌ట్టిన ఆల‌యానికి (బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి) విరాళాలు ఇచ్చి వెళ్లారు అభిమానులు..అభినందించేడు బాల‌య్య..వేడుక‌కు ప్ర‌యోజ‌నం ద‌క్కింది.. సినిమా వేడుక కు ఓ సామాజిక ప్ర‌యోజ‌నం దొరికింది.. క‌నుక ఇక్క‌డ సంతోషం క‌ర్మ‌ఫ‌లం అని చెప్పాడు బాల‌య్య.. ఆనందించాలి మీరు ఆనందించాను నేను..


మ‌నుషుల న‌మ్మ‌కాలు గెలవాలి అంతిమంగా మ‌నిషి క‌దా గెల‌వాలి..సంక‌ల్పం శ్ర‌మ అన్న‌వి దాచుకుని వ‌చ్చిన సంద‌ర్భాన ఓ మ‌హ‌మ్మారి ప్ర‌ళ‌య గ‌ర్జ‌న ను వింటూ త‌ట్టుకుంటూ దాటుకుంటూ పోయిన సంద‌ర్భాన మ‌నిషి నిశ్చ‌లనం నుంచి చ‌ల‌నం.. మ‌హ‌త్త‌రం నుంచి బృహ‌త్త‌రం కావాలి..ఈ కార్తీకం ఈ అఖండ జ్యోతి తెలుగు నేల‌కు కొత్త వెలుగు ఇవ్వాలి..ఆఖ‌రులో ప‌లికిన మాట బ‌న్నీ చెప్పాడు.. మీ అంద‌రి ప్రేమ కోసం అభిమానం కోసం జై బాల‌య్య అంటాను అని అరిచాడు. పిడికిలి బిగించి నిన‌దించాడు. మ‌నుషుల్లో ప్రేమ స్వార్థం నుంచి సినిమా వాళ్ల‌లో ప్రేమ అవ‌స‌రం నుంచి పుడుతుంది. కానీ ఇక్క‌డ వాటిని దాటుకుని పుట్టే ప్రేమ రేప‌టి వేళ మంచి ప‌నుల‌కు, మంచి స్నేహాల‌కు  నాంది కావాలి.. ఆ ఆరంభం ఆ అఖండ ఖ్యాతి ఈ సినిమా వేడుక‌దే కావాలి.

నేను గెల‌వాలి అని అనుకోవ‌డం లేదు సినిమా గెల‌వాలి అని అనుకుంటున్నాను.. ఎంతో గొప్ప మాట.. ఇవాళ విన్న మాటల్లో గొప్ప మాట.. చాలా రోజుల త‌రువాత అంద‌రిలోనూ ఆశావ‌హ దృక్ప‌థం  పెంచిన మాట.. బోయ‌పాటి ప‌లికాడు. వావ్! ఈ మాట‌కు కొన‌సాగింపుగా బాల‌య్య మ‌రో మంచి మాట చెప్పాడు. ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య‌ను స్మ‌రిస్తూ  ఒక మ‌నిషిగా ఇష్ట‌ప‌డ‌డం వేరు ఒక న‌టుడిగా ఇష్ట‌ప‌డడం వేరు అంటూ పెద్ద‌లపై ఉన్న గౌర‌వాన్ని చాటాడు. ఈ రెండు వాక్యాలూ చాలు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ కు..ఈ రెండు వాక్యాలూ చాలు మ‌నుషులు మ‌రింత ప‌రివ‌ర్త‌న చెందేందుకు.. అఖండ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో ఎన్నో గొప్ప సంద‌ర్భాల‌ను తలుచుకున్నారు ప్ర‌తి ఒక్క‌రూ..! ఇవాళ ఉన్న విప‌రీత పోక‌డ‌ల నేప‌థ్యంలో బాల‌య్య కానీ అల్లూ అర్జున్ కానీ బోయ‌పాటి కానీ చాలా రియ‌లైజేష‌న్ నుంచి మాట్లాడారు. అవి సినిమాకే కాదు జీవితానికీ వ‌ర్తించేలా ఉన్నాయి. మ‌నుషులు చాలా కాలానికి చెందిన ప‌రివ‌ర్త‌న‌లా ఉన్నాయి. ఆనందించేను నేను..ఆనందించాలి మీరు..

ఇంకొన్ని మాట‌లు
వేడుక నుంచి వాడుక వ‌ర‌కూ


సుకుమార్ గెలవాలి అనుకోకూడదు పుష్ప గెలవాలి అని అనుకోవాలి
- బోయపాటి శ్రీను

ఇది ఒక అఖండ జ్యోతి లాగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వెలుగు ఇవ్వాలి
- అల్లు అర్జున్

అంద‌రూ అంటున్న విధంగానే సినిమా గెల‌వాలి
చిన్నా పెద్ద అన్న తేడా లేదు
- అల్లు అర్జున్
- త్వ‌ర‌లో భ‌క్తి ఛానెల్ ప్రారంభిస్తా..
న‌వ విధ భ‌క్తి మార్గాల‌నూ వివ‌రిస్తా
జై బాల‌య్య
- సినిమా రంగాన్ని ఆదుకోవాల‌ని
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌నూ కోరుకుంటున్నా
జై బాల‌య్య

- పోలీసు బృందాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన బాల‌య్య
బ‌హిరంగ ప్ర‌దేశంలో ప్రిరిలీజ్ ఫంక్ష‌న్ చేయ‌లేక‌పోయినందుకు
- అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బాల‌య్య, నిర్మాత మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి
- సినిమా రంగాన్ని ఆదుకోవాల‌ని
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కోరుకుంటున్నా
జై బాల‌య్య  


మరింత సమాచారం తెలుసుకోండి: