ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ఎంతలా అతలాకుతలం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా వరద నీరు నిండి పోయింది. దీంతో జనావాసాలు సైతం పెద్ద పెద్ద నదులను తలపించాయి అనే చెప్పాలి. వరదనీరు కారణంగా ఏకంగా ఇళ్లకు ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అల్లాడిపోయారు అని చెప్పాలి.




 ఇక రాయలసీమ లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేసాయి. ఇక వరదల నేపథ్యంలో ఏ క్షణంలో ప్రాణం పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడిపారు అందరూ. ఇలా ఇలా మొన్నటివరకు బెంబేలెత్తించిన వరదలు ఇక ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక భారీ వరదల నేపథ్యంలో ఈ 18వ తేదీన కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోవడం మరింత సంచలనంగా మారిపోయింది. ఒక్కసారిగా అన్నమయ్య ప్రాజెక్టు లోని నీళ్లు మొత్తం గ్రామాల్లోకి దూసుకు వచ్చాయ్.


 దీంతో కొంత మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా నెలకొంది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కట్టా కొట్టుకు పోయిన సమయంలో రామయ్య అనే వ్యక్తి ముందుగా గ్రహించి ఏకంగా వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. తోగురు పేట కు చెందిన రామయ్య అనే 30 ఏళ్ల వ్యక్తి అన్నమయ్య ప్రాజెక్టు వద్ద లస్కర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట మట్టి కుంగటం గమనించాడు రామయ్య. దీంతో వెంటనే అప్రమత్తమయ్యాడు. తోగురు పేట, రామచంద్రపురం, సాలిపేట గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశాడు. వెంటనే కొండపైకి వెళ్లాలి అంటూ సూచించాడు. దీంతో వందల మంది ఇక కొండపైకి చేరుకున్నారు. ఇలా ముందుచూపుతో ఏకంగా 100 మంది ప్రాణాలను కాపాడాడు రామయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: