న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు ఢిల్లీలోనే ఉంటున్నారు. ప్ర‌తిరోజు మిడియాతో మాట్లాడుతారు.. సొంత పార్టీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్‌ను ఎప్పుడూ ఏకిపారేస్తోన్న రఘురామ‌.. ప్ర‌తి విష‌యంలోనూ సుస్ప‌ష్ట అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. త‌న‌పై సీఐడీ కేసులు పెట్టి అరెస్టు చేసినా.. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించినా జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు ఏమాత్రం అద‌ర‌లేదు బెద‌ర‌లేదు. ఆయ‌న అలాగే మాట్లాడుతార‌ని అనుకోవ‌డానికి లేదు ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కు ఏపీలో ఫుల్ ఫాలోయింగ్ ఉందంటా.


  టీవీల్లో ర‌ఘురామ ఎప్పుడు మాట్లాడుతారోన‌ని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయ‌న క్రేజ్ ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా ఉందంట‌. అందుకే ఏకంగా ప్ర‌ధాని మోడీనే ర‌ఘురామ‌ను పేరు పెట్టి ప‌ల‌క‌రించి కొన్ని క్ష‌ణాలు ఆయ‌న‌తో మాట్లాడి భుజం తట్టి ఎంక‌రేజ్ చేశారంట‌. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎంపీ ర‌ఘురామ‌ను ప్ర‌ధాని మోడీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.  అయితే, ర‌ఘురామ కాషాయ పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.



తాజా మోడీ అంత‌టి వారే ర‌ఘురామకు అంత‌టి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో బీజేపీలోకి వెళ్ల‌డం క‌న్ఫం అంటున్నారు. ర‌ఘురామ వైసీపీకి ఈ నెల చివ‌రి వ‌ర‌కు వైసీపీకి రాజీనామా చేసి డిసెంబ‌ర్ 25న అట‌ల్ బిహార్ వాజ్‌పాయ్ జ‌యంతి రోజున కాషాయ కండువా క‌ప్పుకోనున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌రువాత వ‌చ్చే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు జ‌రిగే ఉప ఎన్నిక‌లో న‌ర్సాపురం నుంచి ర‌ఘురామ పోటీ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌కు ముందే ఆర్ఆర్ఆర్ బీజేపీ ఎంట్రీకి స్కెచ్ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. గ‌తంలో చాలా సార్లు బీజేపీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు ఆర్ఆర్ఆర్. కానీ, కొంద‌రు నాయ‌కులు అడ్డుపుల్ల‌లు వేయ‌డంతో ఆ ప్ర‌య‌త్నం ఆగిపోయింద‌ని స‌మాచారం. ఇప్పుడు మ‌ళ్లీ తాజా ప‌రిణామాల‌తో ఈ సారి కన్ఫ‌ర్మ్‌గా బీజేపీలోకి రఘ‌రామ రాజు చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: