సంక్రాంతికి ముందుగా ఓ పెద్ద పండుగ వ‌చ్చేస్తుంది. అఖండ పేరుతో బాల‌య్య ఆ పండుగ‌కు పెద్ద. ఆయ‌నే సంతోషాలు తీసుకురానున్నారు త‌న‌తో! ముఖ్యంగా బాల‌య్య కెరియ‌ర్ లో ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని అఘోర క్యారెక్ట‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. సినిమా కు సంబంధించి డైలాగ్స్ అదిరిపోయాయి అని ఇప్ప‌టికే ట్రైల‌ర్ నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ ధ్రువీక‌రిస్తుంది. దేవుడ్ని కరుణించ‌మ‌ని అడుగు క‌నిపించ‌మ‌ని కాదు అంటూ బాల‌య్య చెప్పిన డైలాగ్ కు మంచి స్పంద‌న ఉంది. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో! సినిమా స్థాయిని పెంచేశాయి. రేప‌టివేళ‌ సినిమా రిజ‌ల్ట్ ను కూడా ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

వ‌రుస‌గా సినిమాలు అన్నీ పెద్ద సినిమాలే! ఇన్నాళ్లు ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి తీసిన సినిమాలు! అప్పులు పుట్టినా పుట్ట‌క‌పోయినా త‌ల తాక‌ట్టు పెట్టి మ‌రీ! తీసిన సినిమాలు! వీటి ఫ‌లితం ఎలా ఉన్నా ముందు రిలీజ్ కు నోచుకుంటే మిగ‌తా ప‌నుల‌న్నీ అవే స‌ర్దుకుపోతాయి. ఈ క్ర‌మంలో పెద్ద సినిమాలు వ‌చ్చే నెల నుంచి సంద‌డి చేస్తాయి. వ‌రుసగా అగ్ర హీరోలు ఆడి, పాడి వినోదాల‌ను అందిస్తారు. ముందుగా డిసెంబ‌ర్ రెండున బాల‌య్య అఖండ‌తో ముందుకు వ‌స్తారు.ఆయ‌న ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఈ సినిమా విజ‌యం ఆయ‌నకే కాదు ఆయ‌న అభిమానుల‌కే కాదు యావ‌త్ తెలుగు సినిమా ప్ర‌పంచానికి ఎంతో అవ‌స‌రం.

వాస్త‌వానికి వ‌కీల్  సాబ్ సినిమా న‌డుస్తుండ‌గా ఏపీ స‌ర్కారు ఉన్న‌ట్లుండి టికెట్ ధ‌ర త‌గ్గించి కొత్త వివాదానికి తెర‌లేపిన విధానం తెలిసిందే! దీంతో వంద‌రూపాయ‌ల‌కే క్లాస్ టికెట్ అమ్మాల‌ని నియ‌మం పెట్టారు జ‌గ‌న్. బాగుంది అంత త‌క్కువ డ‌బ్బుల‌కు తాము టికెట్లు అమ్మ‌లేమ‌ని, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఏపీ స‌ర్కారు  చెప్పేవేవీ వ‌ర్కౌట్ కావ‌ని అంటున్నారు  సినీ నిర్మాత‌లు. ఈ త‌గువు ఇంకా తేలలేదు. ఇప్ప‌ట్లో తేలేలా లేదు కూడా! అయిన‌ప్ప‌టికీ అఖండ సినిమాను కొత్త నిర్మాత అయిన మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి థియేట‌ర్ ముందుకు తీసుకువ‌చ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా స‌గం సీట్ల‌తోనే థియేట‌ర్లు న‌డుపుకోవాల‌న్న ఓ రూల్ ఎప్ప‌టిక‌ప్పుడు అమ‌ల‌వుతూనే ఉంది. దాంతో పాటు టికెట్ ధ‌ర కూడా త‌గ్గించేశారు. ఇలాంటి త‌రుణాన థియేట‌ర్ల సంగ‌తి ఎలా ఉండ‌నుందో మ‌రి! మారిన టికెట్ ధ‌ర‌ల‌కు అనుగుణంగా సినిమాను ఎలా న‌డ‌పనున్నారో అన్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఇప్ప‌టికే పెద్ద‌గా  లాభాలు లేక‌పోయినా సినిమా అంటే ఫ్యాష‌న్ తో ప‌నిచేసే నిర్మాత‌ల‌కూ, ద‌ర్శ‌కుల‌కూ రానున్న కాలం గ‌డ్డు కాల‌మే. అలాకాకుండా ఉండాలంటే ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమా తీయ‌డ‌మే అన్నింటికీ మేలు..అంద‌రికీ మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: