గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి పార్టీకి తిరుగులేని విజయం అందింది. దీంతో టిడిపి బిజెపి పార్టీలు కనబడకుండా పోతున్నాయి. ఒకప్పుడు టిడిపి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. అటు చంద్రబాబు కు, జగన్మోహన్ రెడ్డికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంతా పోరు ఏపీలో కొనసాగుతోంది. అనేక నాటకీయ రాజకీయాలు ఏపీలో చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్భంలోనే బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు జగన్ పాలనలో విఫలమయ్యారని తీవ్రంగా ఖండిస్తూ ఒక లేఖ రాశారు. అందులో ఏముందో తెలుసుకుందామా..?

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు లేఖ రాశారు.  పంచాయతీ నిధుల కు పారదర్శకత ఏదని తెలియజేశారు.  ఏకగ్రీవ పంచాయతీ పాలకమండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏదని ప్రశ్నించారు.  జీవో విడుదల చేసి నవమాసాలు నిండిన అమలు చేయరా అని లేఖ ద్వారా అడిగారు. ఏకగ్రీవం చేసుకుంటే  ప్రోత్సాహకాలు ఇస్తామని చేసిన ప్రకటన ఏమైంది అన్నారు.  మీరు చేసిన ప్రకటన నమ్మి  గ్రామ పంచాయితీలలో ప్రజలు ఏకగ్రీవం చేసుకున్నారని తెలియజేశారు.  జనవరి 26 న అప్పటి సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేసిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు.

 ఏకగ్రీవం చేసుకుంటే భారీ ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటించారు ఏమైందని, కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వెళ్లకుండా అడ్డుకోవడాన్ని బిజెపి ఖండిస్తుందన్నారు. ప్రధాని గ్రామీణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని
ఏకగ్రీవాలకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు లేఖ ద్వారా డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: