కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లా తుఫాను బాధితులను ఆదుకోవాలని, మొత్తం విపత్తుపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సి.ఎస్ కు లేఖరాసిన ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఏ సమస్యలు తెలియజేశారో తెలుసుకుందామా..?
    ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.
    కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేను స్వయంగా సందర్శించి ప్రజల బాధలు చూసినప్పుడు గుండె తరుక్కుపోయింది.
    ప్రజలు ప్రాణాలను కోల్పోవడంతో పాటు, జీవనోపాధి పూర్తిగా కోల్పోయారు.


    వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది.
    పంటలు, ఆస్తితో పాటు పశు సంపదను కోల్పోయి ప్రజలను దిగ్భ్రాంతికి గురయ్యారు.
    రోడ్లు, వంతెనలు, విద్యుత్, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లి విద్య, ఆరోగ్యం, రవాణా వంటి సేవలను ప్రభావితం చేసింది.
    2021 నవంబర్ 19న తుఫాను తీరం దాటినప్పటికీ, నవంబర్ 23 నుంచి 25 వరకు సైతం చాలా గ్రామాలు, కాలనీలు, ఇళ్లు కరెంటు లేకుండా అంధకారంలో ఉన్నాయి.
    నాలుగు రోజుల తర్వాత కూడా తుఫాను బాధితులను ఆహారం, నివాసం లేకుండా రోడ్డు పక్కన ఉండటం చూస్తుంటే హృదయం చలించిపోయింది.
    ఎస్.డి.ఆర్.ఎఫ్. కానిస్టేబుల్‌తో సహా 50 మంది మరణించగా, 25 మంది అదృశ్యమయ్యారు.
    తుపాను కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం.
    మాన ప్రాణ నష్టంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
    2021 నవంబర్ 22వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి ఏపీ శాసనసభలో పేర్కొన్నట్లు ప్రాథమిక పరిశీలనల ప్రకారమే 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది.
    పంట నష్ట విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
    ప్రభుత్వ ప్రాథమిక పరిశీలనల ఆధారంగా పంట, మౌలిక సదుపాయాల నష్టం రూ. 6054.29 కోట్లు అయితే ప్రభుత్వం కేవలం 35 కోట్లు మాత్రమే విడుదల చేయడం అత్యంత విషాదకరం.
    31 మార్చి 2020తో ముగిసే సంవత్సరానికి సంబంధించిన స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధికి సంబంధించిన రూ. 1,100 కోట్ల నిధులు వ్యక్తిగత డిపాజిట్ ఖాతాకు మళ్లింపు చేసుకుంది.
    ఇది నిబంధనలు, అకౌంటింగ్ విధానాన్ని ఉల్లంఘించడమే.
    విపత్తు ముందస్తు హెచ్చరికలు, నష్టనివారణ, సహాయ చర్యల కోసం ప్రభుత్వం డబ్బును ఖర్చు చేయకుండా ఎస్.డి.ఆర్.ఎఫ్ ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించింది.
    నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) మార్గదర్శకాల ప్రకారం విపత్తు సహాయం పొందడం బాధిత ప్రజల హక్కు ప్రాధమిక హక్కు.
    తుపాను బాధితులకు విపత్తులను తట్టుకునే సామర్థ్యంతో మన్నికైన ఉచిత గృహాలను నిర్మించాలి.
    శాశ్వత నివాసం కల్పించే వరకు, ఎన్.డి.ఎం.ఏ మార్గదర్శకాల ప్రకారం బాధితులకు తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేయాలి.


    ఎగువ ఉన్న అన్ని నీటిపారుదల డ్యాంలు నిండితేనే కింది ఉన్న ప్రాజెక్టులు నిండుతాయి.
    నవంబర్ 2021 మొదటి వారం నాటికి, అన్ని నీటి ట్యాంకులు నిండిపోయాయి.
    కానీ, వర్షపాతం, అల్పపీడనం, తుఫానులపై NDMA మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఎటువంటి భద్రత, ముందస్తు చర్యలు తీసుకోలేదు.
    ముందస్తు ఉపశమన ప్రయత్నాలను చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.
    ముందస్తు హెచ్చరికల వ్యవస్థ విఫలమవడంతో అన్నమయ్య జలాశయంకు గండి పడి కడప జిల్లాలోని చెయ్యేరు నదికి వరద పోటెత్తింది.
    దీంతో ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, రామచంద్రాపురం, గండ్లూరు తదితర గ్రామాలకు వరదనీరు వచ్చి చేరడంతో ఆ గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
    రాయచోటి సమీపంలోని పింఛా ప్రాజెక్టు దెబ్బతినడంతో బాహుదా నది నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో పాటు, గేట్లను తెరవడంలో ఘోరమైన వైఫల్యం కారణంగా అన్నమయ్య జలాశయం ఉద్ధృతంగా మారింది.
    తిరుపతి పట్టణంలోని తుమ్మలగుంట వాటర్‌ ట్యాంక్‌ను ప్లే గ్రౌండ్ గా మార్చడంతో పేరూరు వాటర్‌ ట్యాంక్‌తో పాటు అన్ని వాటర్ ట్యాంక్‌లు దెబ్బతిన్నాయి.
    దీంతో దుర్గానగర్‌ కాలనీ, కృష్ణానగర్‌, గాయత్రీనగర్‌, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏరియా తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
    NMDA మార్గదర్శకాలతో సహా తుఫాను నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని స్పష్టంగా తెలుస్తోంది.
    విపత్తుకు ముందస్తు ఉపశమన ప్రయత్నాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, విపత్తు సమయంలో ప్రతిస్పందన, విపత్తు అనంతర సహాయక చర్యలను ప్రభుత్వం విస్మరించింది.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ప్రజల అవసరాలను తీర్చడం చాలా అవసరం.
    ఈ విషయంలో, ప్రజలకు ఈ క్రింది విధంగా ఉపశమనం అందించబడాలని లేఖలో పేర్కొన్నారు.. అలాగే
1.    తుఫాను కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలి.
2.    అదేవిధంగా క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. వారికి జీవనోపాధి కల్పించాలి.
3.    ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ఉచిత గృహాలు నిర్మించాలి.
4.    పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారంగా రూ. 25,000 అందించాలి
5.    వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించిన కుటుంబాలకు పరిహారంగా రూ. 10,000 అందించాలి
6.    తుపాను కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
    పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఈ క్రింది విధంగా పరిహారం అందించాలి.

Sl. No.    Crop    Amount per hectare
(in Rs.)
1.    వరి    30,000
2.    అరటి    50,000
3.    చెరకు    25,000
4.    పత్తి    30,000
5.    వేరుశనగ    25,000
6.    జొన్న    15,000
7.    మొక్కజోన్న    20,000
8.    సన్ ఫ్లవర్    20,000
9.    జీడిమామిడి    50,000
10.    కొబ్బరి    3,000 per plant
11.    మామిడి    40,000
12.    ఫాల్ మైరా ఫాం ట్రీ    2,500 పర్ ట్రీ.
    కోవిడ్ ప్రేరేపిత ఆర్థిక ఒడిదుడుకుల తర్వాత ప్రజలు తిరిగి కోల్కొంటున్న సమయంలో తుఫాను వారిపై మరింత పెంచింది.
    అందువల్ల, వివిధ రంగాల నుండి జీవనోపాధిని కోల్పోయిన బాధితులకు ఈ క్రింది పరిహారం అందించబడుతుంది:

Sl. No.    Particulars    Amount
(in Rs.)
1.    ఉపాధి కోల్పోయిన చేనేతలకు    20,000
2.    వీధి వ్యపారులకు    20,000
3.    ఆటో రిక్షాల వారికి    20,000

తుపాను కారణంగా కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, వ్యవసాయ కార్మికులు మొదలైన కొన్ని సంఘాలు పూర్తిగా జీవనోపాధిని కోల్పోయాయి.
అందువల్ల, జీవనోపాధి కోల్పోయిన వ్యక్తులను గుర్తించి, హుద్‌హుద్, తిత్లీ తుఫానుల సమయంలో అందించిన అదనపు నిత్యావసర వస్తువులను అందజేయాలి.
ఉదాహరణకు, హుద్‌హుద్ ఉపశమనం సమయంలో నేత, మత్స్యకార సంఘాలకు ప్రత్యేక సహాయంగా అందించిన 25 కిలోల బియ్యం స్థానంలో 50 కిలోల బియ్యాన్ని అందించాలి
అదేవిధంగా, ఆక్వాకల్చర్, ఫిషింగ్ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైన మరొక రంగం.
అందువల్ల, తుఫాను కారణంగా ఈ రంగానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రింది విధంగా చేయాలి:

Sl. No.    Particulars of Loss in Fishing Sector    Amount
(in Rs.)
1.    ఆక్వాకు (హెక్టారుకు)    50,000
2.    పడవలు ధ్వసమైన మత్స్యకారులకు    2,00,000
3.    పడవలు పూర్తిగా ధ్వంసమైన వారికి    8,00,000
4.    వలలు కోల్పోయిన వారికి    20,000
5.    కొత్త వలలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ    75%
6.    కొత్త పడవలు కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడి    5,00,000

    పౌల్ట్రీ, పశువుల పెంపకం వ్యవసాయానికి అనుబంధం కాదు. కానీ, గృహాలకు అదనపు జీవనోపాధి, ఆదాయ వనరు.
    తుపాను వల్ల పశువులు, కోళ్ల పెంపకంపై ప్రభావం చూపడంతో కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడింది.
    అందువల్ల, పశువులు కోళ్ళ నష్టానికి ప్రభుత్వం ఈ క్రింది పద్ధతిలో పరిహారం, సాయం అందించాలి.

Sl. No.    Particulars of livestock/poultry    Amount (in Rs.)
1.    చనిపోయిన ప్రతీ ఆవు-గేదెకు    40,000
2.    జెర్సీ ఆవుకు    50,000
3.    చనిపోయిన ప్రతీ గొర్రె -మేకకు    6,000
4.    ధ్వంసమైన గోశాలలకు    25,000
5.    పూర్తిగా ధ్వంసమైన గోశాలలకు    Rs. 3-5 lakhs
6.    కోళ్లకు    Rs. 250 for country hen;
Rs. 100 for broiler/layer hen
7.    దెబ్బతిన్న కోళ్ల ఫాంలకు    50,000

    విపత్తు అనంతరం అంటు వ్యాధులు పెరగడం సహజం కాబట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 24x7 వైద్య శిబిరాల ద్వారా అందరికీ ఉచిత ఆరోగ్య సౌకర్యాలను అందించండి.
    కొండ చుట్టూ కపిల తీర్థం పక్కన ఒక కందకాన్ని తవ్వాలి, తద్వారా తిరుమల నుండి వచ్చే వర్షపు నీటిని కందకం ద్వారా స్వర్ణముఖి నదిలోకి మళ్లించవచ్చు.
    వర్షపు నీటిని తిరుపతి పట్టణంలోకి మళ్లకుండా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
    సంభవించిన వరదల స్వభావాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం సకాలంలో స్పందించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
    అందువల్ల, ప్రాణ, ఆస్తి, జీవనోపాధి, పశువుల నష్టానికి కారణమైన మొత్తం విపత్తుపై న్యాయ విచారణ నిర్వహించబడుతుంది.
    పైన పేర్కొన్న విధంగా తక్షణ సహాయాన్ని అందించడంతోపాటు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితిని నెలకొల్పేందుకు ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టాలి.
    కోవిడ్ ప్రేరిత ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో ప్రజలు సాధారణ స్థితికి వచ్చేలా పైన పేర్కొన్న సమగ్ర పరిహారం ప్యాకేజీ ప్రకటించాలి.
    రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరోసారి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచరికలు ఉన్నాయి.
    కాబట్టి, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో విపత్తు ప్రతిస్పందన, సహాయక చర్యలతో పాటు ముందస్తు ఉపశమన ప్రయత్నాలు చేపట్టాలి.
    కనీసం విపత్తు అనంతర సాయంలోనైనా ప్రభుత్వం స్పందించి తుఫాను బాధితులకు తగిన సాయం అందించాలని కోరుతున్నానని చంద్రబాబు లేఖ ద్వారా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: