మేనత్త కు అండగా నిలబడ్డాడు అయినా తెలుగు తమ్ముళ్లు తెగ తిట్టేస్తున్నారు. అసెంబ్లీ ఘటనపై గోంతేత్తాడు. అయినా టిడిపి నేతలు తారక్ ను  టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా కనీసం వారి మాటలను వారించడం లేదు. ఇదే జూ.ఎన్టీఆర్ ను హర్ట్ చేసిందా? ఏపీ అసెంబ్లీ లో మొన్న చంద్రబాబు టార్గెట్ గా సాగిన ఘటన అనేక పరిణామాల వైపు మళ్ళుతొంది. సానుభూతిని అస్త్రంగా మలుచుకోవాలని చంద్రబాబుతో పాటు ఇతర నేతలు వాడివేడిగా డైలాగ్ లు పేలుతున్నాయి. కొందరైతే దీక్షలు సైతం చేశారు. అయితే అటు ఇటు తిరిగి జూ.ఎన్టీఆర్ పై విమర్శలు లంకించ్చుకున్నారు టిడిపి నేతలు.

తన మేనత్త పై అవమానకరంగా మాట్లాడితే ఇలాగేనా స్పందించేది అంటూ కారాలు మిరియాలు నూరారు టీడీపీ నేతలు. నందమూరి కుటుంబ సభ్యుడిలా కాకుండా దేశభక్తి పౌరుడిగా మాట్లాడుతున్నారంటూ బిల్డప్ ఏంటని తారక్ పై సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ పై రెచ్చిపోయారు. ఇలా టిడిపి నేతలు తనపై చెలరేగిపోవడం తారక్ ను హార్ట్ చేసిందట. సంచలన నిర్ణయం తీసుకోవాలన్న కసిని మరింత పెంచిందట. టిడిపి పార్టీ తరఫున తాను తన తండ్రి అంతగా పోరాడిన పార్టీ బలోపేతానికి కృషి చేసిన కనీసం ఎవరు గుర్తించకపోవడం పట్ల చాలా  ఫీల్ అయ్యారట ఎన్టీఆర్. అన్నింటి కంటే ఎక్కువ బాధ పెట్టింది చంద్రబాబు స్పందనా రాహిత్యం అని తన సన్నిహితులతో అన్నారట  తారక్. టిడిపి సీనియర్ నేతలందరూ తనను టార్గెట్ చేస్తున్న చంద్రబాబు కనీసం వారించక పోవడం మరింత బాధించిందని వాపోయారట. జూ. ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టలనుకున్నట్టు కొందరు ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు ఎలాగు నందమూరి వారసులకు టిడిపి బాధ్యతలు అప్పగించడని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన జూనియర్ మనమే అన్న గారి పేరు మీద పార్టీ పెడదామని తన క్లోజ్ సర్కిల్ నేతలతో అన్నారట. చూడాలి ఎన్టీఆర్ ఆలోచనలు నిజంగా రాజకీయ పార్టీ వైపు నడిపిస్తాయో, ఆ కాలం వరకు పరిణామాలు ఎలా మారుతాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: