చైనాలో కొత్త సమస్య వచ్చింది. సాధారణంగా ఒక దేశం నుండి మరో దేశానికి సముద్ర మార్గం ద్వారా సరుకు రవాణా జరిగేటప్పుడు దానిని సాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. అది భద్రత కోసం కావచ్చు లేదా ఆయా సరుకులు సరైన మార్గం ద్వారా వెళ్లాల్సిన చోటుకు వెళ్తున్నది లేనిది తెలుసుకోవడానికి కావచ్చు, నిరంతర పరిశీలన ఉంటుంది. అయితే తాజాగా చైనా షిప్ లు కనిపించకుండా పోతున్నాయట. అంటే సాటిలైట్ దృష్టిని కూడా తప్పించుకుంటున్నట్టు చెపుతున్నారు. ప్రపంచం ఉలిక్కిపడి పనులు ఇటీవల చైనా చేస్తుండటంతో అక్కడ ఏమైనా కూడా అందరూ  గమనిస్తున్నారు. ఎప్పుడు ఈ చైనా ఏ సమస్య తెచ్చిపెడుతుందో అని వాళ్లలో కాస్త ఆందోళన లేకపోలేదు. ఈ ప్రస్తుత సమస్య కూడా చైనా కుతంత్రాలతో భాగమేనా లేక దాని ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.

ఈ చైనాలో ఏది జరిగినా ప్రపంచం ప్రభావితం అవుతుంది. అతిపెద్ద ఓడరేవు ఉన్న చైనా లో గత కొన్నాళ్లుగా వాణిజ్య నౌకల జాడ కనిపించకుండాపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా గందరగోళంలో ఉండటం తో, ఈ ఓడల సమాచారం అందుబాటులో లేకపోవడం, క్వారంటైన్ నిబంధనలు, కంటైనర్ ల కొరత లాంటివి పెద్ద సమస్యగా మారింది. వీటన్నిటి వలన సరుకు రవాణాకు కూడా తీవ్రంగా సమస్య ఎదురవుతుంది. సముద్రంలో ఒక నౌక ప్రయాణిస్తుంటే దానిని గుర్తించే ఆటోమేటిక్ టెక్నాలజీ ఉంటుంది. దాని ద్వారా ఆ ఓడ ఎక్కడ ఉంది, ఎంత వేగంతో వెళుతుంది, ఏ దిశగా వెళ్తుంది అనే వివరాలు తెలుసుకుంటారు. తద్వారా ఆయా స్టేషన్ లకు ఓడలు సమాచారం ఇస్తుంటాయి, అలాగే ఏదైనా సమాచారం ఆయా ఓడరేవుల నుండి ఆయా ఓడలకు చేరవేస్తారు. ఒకవేళ దూరం ఎక్కువగా ఉన్నట్టయితే సాటిలైట్ ద్వారా కూడా ఈ సమాచారం ఇరువురుకు చేరవేయబడుతుంది.

ఇంత పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ, చైనా ఓడలు కనిపించకుండా పోతుండటం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయి. గత నెల నుండి ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. విదేశీయులు తమ నౌకల విషయాన్ని తెలుసుకుంటున్నారనే అనుమానంతో చైనా గుట్టుగా ఇలా చేస్తుందా లేక తాజాగా ఆ దేశంలో  తెచ్చిన సమాచార గోప్యత కింద ఈ ఓడలను ఇతర దేశాలు పసిగట్టకుండా కొత్త టెక్నాలజీ వాడుతోందా అనేది అందరి ప్రశ్న. దాదాపు 90 శాతం ఓడల పరిస్థితి ఇదే కావడంతో మరోసారి చైనా ప్రపంచానికి ఏ ఉపద్రవం తెస్తుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై చైనా ను ప్రశ్నించగా, తమ ఓడరేవులు సక్రమంగానే పనిచేస్తున్నాయని చెపుతుంది. కానీ సమాచారం మాత్రం అంతర్జాతీయ సమాజానికి తెలియడం లేదు. ఇప్పుడు ఇదో పెద్ద సందేహం అయి కూర్చుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: