బ్రిటన్ లో కూడా చైనా మాదిరి వ్యాపార సంస్థలు భారీ నష్టాలవైపుకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం కూడా అక్కడ కరోనా తీవ్రంగా ప్రభావం చూపడం తెలిసిన విషయమే. కరోనా ప్రారంభం నుండి అందరికి ఉన్న సమస్యే ఈ దేశం ఎదురుకొన్నది. సాంకేతికత తో ఉత్పత్తి జరుగుతున్నందున చిప్ లేని కొరత, ఒక్కోసారి కనీసం ఇంధనం లేమి కొరత ఇలా ఒకదాని తరువాత మరొకటి సమస్యలు వచ్చిపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఇప్పుడు కూడా కనిపిస్తుంది, అందుకే దాదాపు 40శాతానికిపైగా అక్కడ సంస్థలలో వస్తు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనితో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీనికి తోడు అక్కడ సామజిక ఉద్యమాలు కూడా పెరిగిపోతున్నాయి. అక్కడ ఉంటున్న విదేశీయులు వెళ్లిపోవడంతో కనీసం ఇంధనం కోసం బంకులకు వెళితే మానవ వనరులు లేని స్థితి.

1956 తరువాత బ్రిటన్ ఇంతగా వ్యాపారంలో నెమ్మదించడాన్ని ఎదుర్కొంటుంది అని అక్కడి నిపుణులు చెపుతున్నారు. ఒకపక్క చిప్ లభించక ఉత్పత్తి ఆగుతుంది అనేది ఒక కారణం అయితే, వినియోగదారులతో కూడా కొనుగోలు ఆసక్తి కూడా బాగా తగ్గిపోతుందని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీనితో అక్కడ ఎన్నడూ లేని వ్యాపార సంక్షోభం తలెత్తుతుంది. మరోసారి యూరప్ దేశాలలో కరోనా వ్యాప్తి చెందటంతో ఆయా దేశాలల ప్రజలు ఆందోళనలో ఉన్న మాట వాస్తవం. అందుకే వాళ్ళు కూడా కొత్త వస్తువు కొనుగోలు అనేదానికి పెద్దగా ఆసక్తి చూపే స్థితిలో లేకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా అగ్రరాజ్యం అనుకున్న దేశాలు కూడా కరోనా దెబ్బకు తీవ్రంగా ఆందోళన చెందుతుండటం చూస్తుంది ప్రపంచం.

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం లేదా నగరం అంటే బ్రిటన్ అని లేదా లండన్ అని చెప్తారు. అలాంటి చోట నేడు పరిస్థితి తలకిందులు అయ్యేట్టుగానే ఉన్నది. మొన్నటి వరకు తిరుగులేదు అనుకున్న అమెరికా కూడా కరోనా దెబ్బతో వణికిపోతోంది. ఇప్పటికి అలాంటి స్థితిలోనే ఉన్నదని చెప్పడంలో సందేహం లేదు. ఇవన్నీ గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలుగా కరోనా ముందు వరకు ప్రపంచాన్ని శాసిస్తూ బ్రతికేశాయి. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం కరోనా సమయంలో చిన్న దేశాలు ప్రవర్తించినట్టుగా కూడా ఈ దేశాలు చేయలేకపోయాయి. పేరుకు పెద్దన్నలుగా ఉన్నప్పటికీ, ఒక సమస్య వస్తే వణికిపోతున్నాయి. ఇందులో ఏ అభివృద్ధి చెందిన దేశానికీ మినహాయింపు లేదనే చెప్పాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: