తాలిబన్ లు ఆఫ్ఘన్ లో రోజురోజుకు సరికొత్తగా హింసకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రపంచం తమను గుర్తించలేదని అక్కసును ఆఫ్ఘన్ పౌరులపై బాగానే చూపిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తమ దేశంలో అభివృద్ధి కానీ శాంతి కానీ నెలకొనలేకపోవడానికి ప్రపంచమే కారణం అని కూడా వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు తాలిబన్ లు. తద్వారా అయినా ప్రపంచం తమను గుర్తిస్తుందనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఆధిపత్యం కోసం పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ లో ఆధిపత్యం కోసం అటు ఐఎస్ ఇటు తాలిబన్ లు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకరిని ఒకరు చంపుకుంటూనే ఉన్నారు. వారి ఆధిపత్య పోరులో సామాన్య ఆఫ్ఘన్ ప్రజలు బలిపశువులు అవుతున్నారు. ఇక ఇప్పటికే రెండు గ్రూపులతో ఉన్న వాళ్ళవాళ్ళ గూఢచారులను పసిగట్టే పనిలో ఈ రెండు తీవ్రవాద సంస్థలు నిమగ్నం అయ్యాయి.

రోజు ఏదో ఒక రక్తపాతం ఆఫ్ఘన్ లో జరుగుతూనే ఉంది అంటే కారణం తాలిబన్ లు మరియు ఐఎస్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు మాత్రమే. తాజాగా ఒక వైద్యుడు ఐడి ని చూపిస్తూనే సరిహద్దు దాటినప్పటికీ, అతడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అలాగే హెరాక్ ప్రావిన్స్ లో వైద్యుడు అత్యవసర కేసు రావడంతో వైద్యం నిమిత్తం వెళ్తుండగా, అనుమానంతో తాలిబన్ లు కాల్చేశారు. ఇలా దాదాపుగా తొమ్మిది మందిని హతమార్చారు. ఇక అక్కడ తాజాగా వెలుగు చూస్తున్న మరో నేరం, కిడ్నాప్ లు. అవి మాత్రం తాలిబన్ లు చేయబోవడం లేదు.

అక్కడ ఉన్న ప్రజలలోని కొందరు నేరప్రవృత్తి కలిగిన వారు ఇప్పటికి కాస్త స్థిరపడిన, సంపద ఉన్న ఆఫ్ఘన్ లను గుర్తించి వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇక పాలకులు తాలిబన్ లు కాబట్టి, వాళ్ళ వద్దకే ఆయా కుటుంబాలు వెళ్లి మొరపెట్టుకుంటున్నాయి. కానీ అరాచకాలు చేయడం తప్ప, కాపాడటం తెలియని తాలిబన్ లు వాళ్లకు పట్టుకోలేకపోతున్నారు. దీనితో ఆయా బాధితులు డబ్బులు కట్టడమో లేక తమ వారిని కోల్పోవడమో జరుగుతుంది. మొత్తానికి ఆఫ్ఘన్ ఇంకా రావణకాష్ఠంగానే రగిలిపోతూనే ఉంది. అరాచకాలు తప్ప బ్రతుకుపై ఆశ కనిపించే స్థితి ఇప్పట్లో లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: