ఓమిక్రాన్ వేరియంట్ భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. కరోనా పరీక్షలు పెంచాలనీ.. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ వెంటవెంటనే పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలని గైడ్ లైన్స్ లో సూచించింది.

ప్రపంచమంతా కొత్త కరోనా వేరియంట్ పై భయపడుతుండగా.. సౌతాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలడం కలకలం రేపుతోంది. కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆ ఇద్దరినీ ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచారు. అయితే వారిలో ఓమిక్రాన్ వేరియంట్ నిర్ధారణకు శాంపిల్స్ ను ముంబైకు పంపగా.. 48గంటల తర్వాత రిపోర్టులు రానున్నాయి. దీంతో కర్ణాటక సీఎం బొమ్మై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశం కానుంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నియంత్రణపై చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి మళ్లీ క్వారంటైన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు..మాల్స్, థియేటర్లు, పబ్ లపై నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అటు రాష్ట్రంలో వరి కొనుగోలు వేగవంతంపై కూడా కేబినెట్ చర్చించనుంది.

ఇక భారత్ లో గత 24గంటల్లో కొత్తగా 8వేల 774కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 621మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 9వేల 481మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం లక్షా 5వేల 691యాక్టివ్ కేసులున్నాయి. అయితే నిన్న 82లక్షల 86వేల 58లక్షల కరోనా టీకా డోసుల పంపిణీ జరిగింది. మొత్తానికి కొత్త వేరియంట్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.







 


మరింత సమాచారం తెలుసుకోండి: